iDreamPost
android-app
ios-app

ఆ టైమ్‌లో నన్ను బ్యాన్‌ చేయొద్దని అతన్ని ప్రాథేయపడ్డాను: కోహ్లీ

  • Published Aug 06, 2024 | 1:27 PM Updated Updated Aug 06, 2024 | 1:27 PM

Virat Kohli, SCG, IND vs AUS, Middle Finger: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ.. ఒక సమయంలో నిషేధానికి గురి అయ్యేవాడు. కానీ, తన తప్పు తెలుసుకొని, రిక్వెస్ట్‌ చేయడంతో బతికిపోయాడు. ఆ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, SCG, IND vs AUS, Middle Finger: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ.. ఒక సమయంలో నిషేధానికి గురి అయ్యేవాడు. కానీ, తన తప్పు తెలుసుకొని, రిక్వెస్ట్‌ చేయడంతో బతికిపోయాడు. ఆ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 06, 2024 | 1:27 PMUpdated Aug 06, 2024 | 1:27 PM
ఆ టైమ్‌లో నన్ను బ్యాన్‌ చేయొద్దని అతన్ని ప్రాథేయపడ్డాను: కోహ్లీ

విరాట్‌ కోహ్లీ ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత.. కాస్త కామ్‌ అయ్యాడు కానీ, అంతకు ముందు కోహ్లీ అంటే లోడ్‌ చేసిన గన్‌లా ఉండేవాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు కాస్త కవ్విస్తే చాలు.. టీమ్‌ మొత్తం ఒక్కడై ఎదిరించేవాడు. ఈ దూకుడు శైలి కోహ్లీకి కెరీర్‌ ఆరంభం నుంచి ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో స్లెడ్జింగ్‌కు మారుపేరు లాంటి ఆస్ట్రేలియాతో వారి గడ్డపైనే గొడవ పెట్టుకున్న ఆటగాడు ఎవడైనా ఉన్నాడా అంటే ముందు వినిపించే పేరు విరాట్‌ కోహ్లీనే. అయితే.. ఈ దూకుడే కోహ్లీకి ఒకసారి పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిషేధం ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.

కానీ, మ్యాచ్‌ రిఫరీని కోహ్లీ రిక్వెస్ట్‌ చేయడంతో.. కుర్రాడని కనికరించి ఆ మ్యాచ్‌ రిఫరీ కోహ్లీపై బ్యాన్‌ వేయకుండా కేవలం మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తూ.. కోహ్లీని క్షమించి వదిలేశాడు. దాదాపు 12 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన గురించి విరాట్‌ కోహ్లీ చెబుతున్న వీడియో తాజాగా వైరల్‌గా మారింది. 2012లో టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. ధోని కెప్టెన్సీలో.. సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో పాటు.. గంభీర్‌, సెహ్వాగ్‌, కోహ్లీతో కూడిన జట్టు.. ఆసీస్‌లో పర్యటించింది.

సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో రెండో టెస్టు రెండో రోజు సందర్భంగా విరాట్‌ కోహ్లీని టార్గెట్‌గా చేసుకుంటూ.. స్టేడియంలో కూర్చున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు ఏవో కామెంట్లు చేశారు. ఉడుకు రక్తంలో ఉన్న విరాట్‌ కోహ్లీ.. వారి భాషలోనే సమాధానం చెప్పాడు. మిడిల్‌ ఫింగర్‌ చూపించాడు. ఈ ఘటనపై మ్యాచ్‌ రిఫరీ తర్వాత రోజు కోహ్లీని తన ఆఫీస్‌కు పిలిపించాడు. తన ముందు కొన్ని న్యూస్‌ పేపర్లు వేశాడు. ఆ న్యూస్‌ పేపర్ల ఫ్రంట్‌ పేజ్‌లో కోహ్లీ మిడిల్‌ ఫింగర్‌ చూపిస్తున్న ఫొటోను చాలా పెద్దగా వేశారు. దీనిపై ఏం సమాధానం చెబుతావని.. మ్యాచ్‌ రిఫరీ అడగ్గా.. తాను ఏదో ఆవేశంలో అలా చేశానని, తప్పు అయిపోయిందని వెంటనే ఒప్పేసుకున్నాడు. తనపై బ్యాన్‌ విధించొద్దని కూడా రిక్వెస్ట్‌ చేశాడు. అప్పుడే క్రికెట్‌లో ఎదుగుతున్న కోహ్లీ ఏదో కుర్రతనంలో తెలియక చేశాడని భావించిన మ్యాచ్‌ రిఫరీ.. కోహ్లీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పెట్టి.. వదిలేశాడు. ఆ సమయంలో మ్యాచ్‌ రిఫరీ కోహ్లీపై బ్యాన్‌ విధించి ఉంటే.. అదో మాయని మచ్చగా మిగిలిపోయేది కోహ్లీ కెరీర్‌లో. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bouncer Avenue (@bounceravenue)