iDreamPost

Virat Kohli: మా అక్క నన్ను బాగా కొట్టింది, కారణం తెలిస్తే: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా రన్ మెషిన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు మా అక్క నన్ను బాగా కొట్టేదని, 50 రూపాయాల నోటు చూస్తే నాకు పూనకాలు వచ్చేవి అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

టీమిండియా రన్ మెషిన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు మా అక్క నన్ను బాగా కొట్టేదని, 50 రూపాయాల నోటు చూస్తే నాకు పూనకాలు వచ్చేవి అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Virat Kohli: మా అక్క నన్ను బాగా కొట్టింది, కారణం తెలిస్తే: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఏ వ్యక్తి జీవితంలోనైనా బాల్యం ఓ తీపి జ్ఞాపకమే. తాము చిన్నతనంలో చేసిన అల్లరి పనులు, చిలిపి పనులను సందర్భం వచ్చినప్పుడు చెప్పుకొస్తుంటారు. టీమిండియా రన్ మెషిన్ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు మా అక్క నన్ను బాగా కొట్టేదని, రూ. 50 రూపాయాల నోటు చూస్తే నాకు పూనకాలు వచ్చేవి అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మరి కోహ్లీని వాళ్ల అక్క ఎందుకు కొట్టేది? 50 రూపాయల నోటుతో విరాట్ కు ఉన్న లింక్ ఏంటి? ఆ వివరాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం పదండి.

విరాట్ కోహ్లీ.. క్రికెట్ గురించి కాస్తో, కూస్తో తెలిసిన వారందరికి సూపరిచితమే. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. తన బ్యాట్ తో వరల్డ్ క్రికెట్ ను ఏలుతున్న రారాజు విరాట్. ఇదిలా ఉండగా.. కోహ్లీ తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నాడు. టీమిండియా ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛైత్రితో గతంలో ఓ సంభాషణలో పాల్గొన్నాడు. దాంట్లో చిన్నప్పటి కోహ్లీ ఎలా ఉండేవాడో చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.”చిన్నతనంలో నాకు ఓ అలావాటు ఉండేది. నేను పెద్ద వాళ్లను కూడా ‘నువ్వు’ అంటూ ఏకవచనంతో పలిచేవాడిని. దాంతో ప్రతీసారి మా అక్కను నువ్వూ, నువ్వూ అంటూ పిలిచాను. ఓసారి అలా పిలవడంతో.. మా అక్కకు కోపం వచ్చి, ఇంకోసారి ఇలా మాట్లాడతావా? అంటూ బాగా కొట్టింది. అప్పటి నుంచి నేను పెద్ద వాళ్లను ‘మీరు’ అని మర్యాదగా పిలవడం ప్రారంభించాను” అంటూ చెప్పుకొచ్చాడు విరాట్.

virat kohli funny comments on his sister

కాగా.. రూ.50 నోటుతో తనకు ఉన్న సంబంధం గురించి కూడా వివరించాడు.”పెళ్లి వేడుకల్లో చాలా మంది గాల్లోకి కరెన్సీ నోట్లు ఎగరేసి డ్యాన్స్ లు చేసేవారు. అది నా మైండ్ లో బలంగా నాటుకుపోయింది. అయితే ఓ రోజు మా ఇంటికి చూట్టాలు వస్తే.. సరుకులు తెమ్మని మా అమ్మ 50 రూపాయాల నోటు ఇచ్చింది. ఆ నోటును చూడగానే సంతోషంలో ముగినిపోయి, ఎగ్జైట్ మెంట్ లో మెట్లమీదకు వెళ్లి దాన్ని చించి.. గాల్లోకి ఎగరేసి, డ్యాన్స్ చేయడం మెుదలుపెట్టాను” అని బాల్యంలో జరిగిన విషయాలను పంచుకున్నాడు. మరి కోహ్లీ బాల్యంలో చేసిన అల్లరి పనులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @Virat Kohli (@virat_kohli_era__18)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి