iDreamPost
android-app
ios-app

మరో ఫేక్‌ న్యూస్‌పై స్పందించిన కోహ్లీ! ఈ సారి ఏకంగా పేపర్‌ పేరు పెట్టి మరీ..

  • Published Aug 16, 2023 | 1:16 PM Updated Updated Aug 16, 2023 | 1:26 PM
  • Published Aug 16, 2023 | 1:16 PMUpdated Aug 16, 2023 | 1:26 PM
మరో ఫేక్‌ న్యూస్‌పై స్పందించిన కోహ్లీ! ఈ సారి ఏకంగా పేపర్‌ పేరు పెట్టి మరీ..

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఈ మధ్య గ్రౌండ్‌లోనే కాదు.. బయట కూడా కాస్త అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. గ్రౌండ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లకు మాటకు మాట బదులిచ్చే కోహ్లీ.. ఇప్పుడు తనపై వచ్చే తప్పుడు వార్తలపై కూడా అదే రేంజ్‌లో ప్రతిస్పందిస్తున్నాడు. ఇటీవల తన సోషల్‌ మీడియా సంపాదన విషయం స్పందించిన కోహ్లీ తాజాగా మరో ఫేక్‌ న్యూస్‌పై కూడా స్పందించాడు. ఈ సారి ఏకంగా ప్రముఖ న్యూస్‌ పేపర్‌ పేరును ఫొటోతో సహా ప్రస్తావిస్తూ.. ఘాటుగా స్పందించాడు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు 2022లో ముంబైకి సమీపంలోని ఖరీదైన అలీబాగ్‌ ప్రాంతంలో రూ. 19.24 కోట్లు పెట్టి సుమారు 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ స్థలంలో విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ నిర్మిస్తున్నారు. విరుష్క జంట ఇటీవల అలీబాగ్‌ వెళ్లి ఫామ్‌హౌస్‌ నిర్మాణ పనులను సైతం పరిశీలించారు. అయితే.. ఈ ఫామ్‌లో విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ పిచ్‌ను సైతం నిర్మిస్తున్నాడంటూ ఆంగ్ల పత్రిక ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కోహ్లీ ఇదో ఫేక్‌ న్యూస్‌ అంటూ స్పష్టం చేశాడు.

తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఆ ఆర్టికల్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను చిన్నతనం నుంచి చదువుతున్న దిన పత్రిక సైతం.. తప్పుడు వార్తలు రాయడం మొదలుపెట్టింది’ అంటూ కొంత సెటైరికల్‌గా స్పందించాడు. కోహ్లీ ఖండనతో తన నూతన ఫామ్‌ హౌజ్‌లో కోహ్లీ ఎలాంటి క్రికెట్‌ పిచ్‌ను నిర్మించడంలేదనే విషయం స్పష్టమైంది. అయితే.. గతంలో తన గురించి వార్తలు ఎలాంటివైనా ఏ మాత్రం పట్టించుకోని కోహ్లీ.. ఇప్పుడు తప్పుడు వార్తలను చీల్చిచెండాడుతున్నాడు. సోషల్‌ మీడియాలో వార్తల్లో వస్తున్నట్లు తన సంపాదన అంతలేదని చెప్పిన కోహ్లీ.. ఇప్పుడు ఏకంగా ఓ ప్రముఖ న్యూస్‌పేపర్‌కు దిమ్మతిరిగే జవాబు ఇచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్‌లాడి.. కోహ్లీ బెస్ట్‌ కెప్టెన్‌ అంటున్న భారత క్రికెటర్‌!