SNP
SNP
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విరుచుకుపడ్డాడు. పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ.. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 122 పరుగులు చేసి.. అదరిపోయే సెంచరీతో టీమిండియా భారీ స్కోర్ అందించాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ సైతం సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో భారత ఇన్నింగ్స్ గట్టి పునాది వేశారు. ఆదివారం టీమిండియా 24.1 ఓవర్లు ఆడిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేసి.. ఇవాళ రిజర్వ్‌డేలో నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ మొదలుపెట్టిన టీమిండియా మరో వికెట్ కోల్పోకుండా 356 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అయితే.. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. పర్ఫెక్ట్ వన్డే ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఆకట్టుకున్నాడు. ఆరంభంలో రెండు వికెట్లు వెంటవెంటనే పడటంతో కాస్త టైమ్ తీసుకోని ఆడిన కోహ్లీ.. కేఎల్ రాహుల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. మెల్లమెల్లగా స్ట్రైక్‌రేట్ పెంచుతూ.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అయితే బ్రేకుల్లేని బుల్లెట్ ట్రైన్‌లో దూసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ మరుపురాని, మధురమైన షాట్‌ను కోహ్లీ రిపీట్ చేశాడు.
ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ తప్ప మరే క్రికెటర్ కూడా ఆడని షాట్ ఏదంటే.. ప్రతి క్రికెట్ అభిమాని చూపించే షాట్ ఒకటుంది. టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో స్ట్రేయిట్ బ్యాట్‌తో డౌన్ ది గ్రౌండ్ సిక్స్ కొట్టిన షాట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో వచ్చే బంతిని వరల్డ్ క్రికెట్‌లో మరే క్రికెటర్ కూడా అలాంటి షాట్ ఆడిన దాఖలాలు లేవు. పైగా అది ఎంత ఒత్తిడిలో కొట్టిన షాటో అందరికి తెలిసిందే. అయితే.. అలాంటి అద్భుతమైన షాట్‌ను కోహ్లీ తాజాగా పాకిస్థాన్‌పైనే మళ్లీ ఆడాడు. ఈ సారి రౌఫ స్థానంలో నసీమ్ షా బలయ్యాడు. నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో 4వ బంతిని కోహ్లీ స్ట్రేయిట్ సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ కిందున్న ఆ షాట్ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Two greatest shot of all time 🐐#INDvPAK #ViratKohli pic.twitter.com/70QAuU8rqM
— LESER. (@imleser82) September 11, 2023
ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే క్యాచ్.. ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం! వీడియో వైరల్