iDreamPost

Virat Kohli: వరల్డ్  క్రికెట్ లో టాప్-4 ఆటగాళ్లను ఎన్నుకున్న కోహ్లీ! లిస్ట్ లో ఎవరున్నారంటే?

జియో సినిమాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో తనకు నచ్చిన టాప్-4 ప్లేయర్లను ఎంపిక చేశాడు. అందులో ఒకే ఒక్క భారతీయుడు ఉండటం గమనార్హం. మరి ఈ లిస్ట్ లో ఇంకెవరున్నారు?

జియో సినిమాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో తనకు నచ్చిన టాప్-4 ప్లేయర్లను ఎంపిక చేశాడు. అందులో ఒకే ఒక్క భారతీయుడు ఉండటం గమనార్హం. మరి ఈ లిస్ట్ లో ఇంకెవరున్నారు?

Virat Kohli: వరల్డ్  క్రికెట్ లో టాప్-4 ఆటగాళ్లను ఎన్నుకున్న కోహ్లీ! లిస్ట్ లో ఎవరున్నారంటే?

విరాట్ కోహ్లీ.. ఈ ఐపీఎల్ సీజన్ లో పరుగుల వరదపారిస్తున్నాడు. కేవలం కోహ్లీ వల్లే ఆర్సీబీకి ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్స్ లు ఉన్నాయి. ఇక ఈ సీజన్ లోనే హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ-చెన్నై టీమ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జియో సినిమాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో తనకు నచ్చిన టాప్-4 ప్లేయర్లను ఎంపిక చేశాడు. అందులో ఒకే ఒక్క భారతీయుడు ఉండటం గమనార్హం. మరి ఈ లిస్ట్ లో ఇంకెవరున్నారు? చూద్దాం పదండి.

టీమిండియా రన్ మెషిన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో తనకు నచ్చిన టాప్-4 ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాడు. అల్టిమేట్ స్ట్రీట్ క్రికెట్ సైడ్ టీమ్ కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటారు అని జియో సినిమా పోగ్రాంలో ప్రశ్న ఎదురుకాగా.. తన ఎంపికను తెలియజేశాడు. కోహ్లీ ఎన్నుకున్న ఆ నలుగురు ఎవరంటే? ఏబీడీ, జస్ప్రీత్ బుమ్రా, ఆండ్రీ రస్సెల్, రషీద్ ఖాన్ లను తన టీమ్ గా ఎంపిక చేసుకున్నాడు.

అయితే ఈ లిస్ట్ లో టీమిండియా నుంచి బుమ్రా ఒక్కడినే ఎంపిక చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లు ఎందరో భారత జట్టులో ఉన్నప్పటికీ.. అందులో ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఆర్సీబీ తరఫున ఎన్నో సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన ఏబీడీని ఎన్నుకోవడంలో ఎవ్వరిని షాక్ కు గురిచేయలేదు. ఎందుకంటే? వారిద్దరు ఆర్సీబీ తరఫునే చాలా సీజన్లు ఆడారు. దాంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. రస్సెల్, రషీద్ ఖాన్ లను ఎన్నుకోవడం  కాస్త విచిత్రంగానే ఉందంటున్నారు నెెటిజన్లు. మరి విరాట్ కోహ్లీ టాప్-4 ఎంపికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి