iDreamPost
android-app
ios-app

Virat Kohli: టీ20 వరల్డ్ కప్ 2024 కోహ్లీ ఆడటం పక్కా! ఇదిగో ప్రూఫ్

  • Published Apr 02, 2024 | 8:31 PM Updated Updated Apr 02, 2024 | 8:31 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ 2024 ఆడతాడా? లేడా? అన్న అనుమానం చాలా మందిలో తలెత్తింది. ఆ మిలియన్ డాలర్ల ప్రశ్నకు తాజాగా ఆన్సర్ దొరికింది.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ 2024 ఆడతాడా? లేడా? అన్న అనుమానం చాలా మందిలో తలెత్తింది. ఆ మిలియన్ డాలర్ల ప్రశ్నకు తాజాగా ఆన్సర్ దొరికింది.

Virat Kohli: టీ20 వరల్డ్ కప్ 2024 కోహ్లీ ఆడటం పక్కా! ఇదిగో ప్రూఫ్

టీ20 వరల్డ్ కప్ 2024.. జూన్ లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం జట్లు సిద్దమవుతున్నాయి. టోర్నీలో పాల్గొనే టీమ్స్ ఇప్పటి నుంచే కప్ కొట్టడానికి వ్యూహాలను రచిస్తున్నాయి. అయితే ఈ పొట్టి ప్రపంచ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతాడా? లేడా? అన్న అనుమానం చాలా మందిలో తలెత్తింది. అందుకు కొన్ని కారణాలు కూడా తోడైయ్యాయి. కానీ తాజాగా కింగ్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో ఆడాతాడని ప్రూఫ్స్ తో సహా తెలిసిపోయింది. మరి ఇంతకీ ఆ ప్రూఫ్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

విరాట్ కోహ్లీకి సంబంధించి గత కొన్ని నెలలుగా ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న అలాగే ఉంటూ వస్తోంది. జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా? ఈ ప్రశ్న అందరి మదిలో మెదులుతూ.. ఫ్యాన్స్ ను ఆందోళన పెట్టింది. అదీకాక ఈ ప్రశ్నకు బలం చేకూర్చుతూ.. వెస్టిండీస్ లాంటి స్లో పిచ్ లపై కోహ్లీ విఫలం అవుతాడన్న వార్తలు వైరల్ గా మారాయి. దీంతో నిజంగానే విరాట్ పొట్టి క్రికెట్ ఆడడా? అన్న సందేహాలు బయలుదేరాయి. తాజాగా ఆ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క సమాధానం లభించింది.

టీ20 వరల్డ్ కప్ 2024కు సంబంధించిన పొస్టర్ ను ఐసీసీ విడుదల చేసింది. అందులో విరాట్ కోహ్లీ ఫొటో ఉంది. దీంతో అందరి అనుమానాలు పటాపంచల్ అయ్యాయి. ఇంకేటి మా విరాట్ భాయ్ టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నాడు.. అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఇన్ని రోజులు కోహ్లీ ఈ మెగా టోర్నీ ఆడే విషయంలో సందేహాలు ఉన్నాయి. ఐసీసీ విడుదల చేసిన పోస్టర్ తో అవన్నీ బద్దలైయ్యాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇదికూడా చదవండి: మా తప్పు వల్లే ఇంగ్లండ్ కు 2019 ప్రపంచ కప్.. అంపైర్ సంచలన కామెంట్స్!

marsbahis girişjojobet