iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌కు ముందు కోహ్లీకి టెస్ట్‌! ఆశ్చర్యపోయిన సపోర్టింగ్ స్టాఫ్!

  • Author Soma Sekhar Updated - 02:45 PM, Thu - 24 August 23
  • Author Soma Sekhar Updated - 02:45 PM, Thu - 24 August 23
వరల్డ్‌ కప్‌కు ముందు కోహ్లీకి టెస్ట్‌! ఆశ్చర్యపోయిన సపోర్టింగ్ స్టాఫ్!

ఆసియా కప్, వరల్ట్ కప్ ముంగిట టీమిండియా సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, మహ్మద్ షమీలతో పాటు మరికొందరికి రెస్ట్ ఇచ్చింది. అయితే వెస్టిండీస్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్న టీమిండియా ప్లేయర్ల కోసం 13 రోజుల ఫిట్ నెస్ ప్రోగ్రామ్ ను సిద్ధం చేశారు ఎన్సీయే ట్రైనర్లు. అందులో భాగంగానే బెంగళూరులోని ఎన్సీయేలో ఐదు రోజుల ప్రొగ్రామ్ ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్యాంప్ లో ఫిట్ నెస్ స్టాండర్డ్స్ ను అందుకోని ఆటగాళ్లను గుర్తించే పనిలో పడింది టీమిండియా మేనేజ్ మెంట్. ఈ క్రమంలోనే నిర్వహించిన యో-యో టెస్ట్ లో పాస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. కాగా.. టీమిండియాలో ఫిట్ నెస్ కా బాప్ అన్న ముద్ర పడ్డ విరాట్ కోహ్లీకే టెస్ట్ పెట్టడంతో.. సపోర్టింగ్ స్టాఫ్ ఆశ్చర్యపోయారు.

విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా, రికార్డుల రారాజుగా, ఫిట్ నెస్ కా బాప్ లాంటి బిరుదులతో వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేసుకున్నాడు. ఇక ప్రపంచ క్రికెట్ లో ఫిట్ నెస్ లో విరాట్ కోహ్లీని మించిన ఆటగాడు లేడంటే అతిశయోక్తికాదు. మరి అలాంటి ఆటగాడికి కూడా ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించారు. మెగాటోర్నీల ముంగిట ఆటగాళ్లకు ఫిట్ నెస్ టెస్ట్ లు నిర్వహించడం సహజమే. అందులో భాగంగానే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ టెస్ట్ లు జరుగుతున్నాయి. ఈ టెస్ట్ ల్లో కీలకమైంది యో-యో టెస్ట్. 20 మార్కులు ఉండే ఈ టెస్ట్ లో.. విరాట్ కోహ్లీ 17.2 స్కోర్ సాధించాడు. దీంతో సపోర్ట్ స్టాఫ్ మెుత్తం ఆశ్చర్యపోయారు. ఫిట్ నెస్ కు పెట్టింది పేరైన విరాట్ కు టెస్ట్ పెట్టడంతో వారు ఆశ్చర్యపోయారు.

కాగా.. విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ పై ఎంత శ్రద్ద తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అతడు తీసుకునే ఫుడ్, డ్రింకింగ్ వాటర్, జిమ్ లో వర్కౌట్స్ తో తన బాడీని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకుంటాడు విరాట్ భాయ్. అలాంటి విరాట్ యో-యో టెస్ట్ లో 17.2 స్కోర్ సాధించాడు. అయితే విరాట్ సాధించిన ఈ స్కోర్ ను టీమిండియాలో మరే ఇతర ఆటగాడు బీట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే? టీమిండియాలో ఫిట్ నెస్ కు మారుపేరు అంటే కోహ్లీనే కాబట్టి. మరి కోహ్లీ ఫిట్ నెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: 199 పరుగులతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్! విమర్శలకు కౌంటర్ ఇచ్చాడుగా..