SNP
SNP
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 తర్వాత టీమిండియా వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 12 నుంచి టెస్ట్ సిరీస్ షురూ కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే కరేబియన్ గడ్డపై భారత ఆటగాళ్లు వాలిపోయి.. ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. రోహిత్ శర్మ టీమ్ వర్సెస్ విరాట్ కోహ్లీ టీమ్‌గా ఈ మ్యాచ్ సాగింది.
అయితే.. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. స్లిప్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో కోహ్లీ అవుటైన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సైతం కోహ్లీ ఇంత ఈజీగా అవుట్ అవ్వడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆఫ్ సైడ్ ఆఫ్‌స్టంప్ బాల్‌ను ఆడే క్రమంలో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం కోహ్లీకి బలహీనతగా మారింది. చాలా కాలంగా ఈ వీక్‌నెస్‌తో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. దీన్ని ఓవర్ కమ్ చేసేందుకు అతను ఎంత ప్రయత్నిస్తున్నా.. వర్క్ అవుట్ కావడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సైతం రెండో ఇన్నింగ్స్‌లో గెలుపుపై ఆశలు రేకెత్తించిన కోహ్లీ 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరి వెస్టిండీస్‌తో సిరీస్‌లోనైనా తిరిగి ఫామ్ అందుకుంటాడని భావిస్తే ఇలా ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే తుస్సు మనిపించాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కింద ఉన్న వీడియో చూసి.. కోహ్లీ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli’s dismissal in the practice match in Barbados today. Jaydev Unadkat claimed his wicket. #WIvIND
Video courtesy: Vimal Kumar pic.twitter.com/IltleUGgwy
— Farid Khan (@_FaridKhan) July 5, 2023