iDreamPost
android-app
ios-app

వీడియో: మ్యాచ్‌ ఓడిపోయినా.. మిచెల్‌ స్టార్క్‌ పరువు తీసిన కోహ్లీ!

  • Published Apr 22, 2024 | 10:20 AM Updated Updated Apr 22, 2024 | 10:20 AM

Virat Kohli, Mitchell Starc, No Look Six: కోల్‌కత్తా నైట్‌ రైడర్సతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయినా.. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ పరువును విరాట్‌ కోహ్లీ తీసి పడేశాడు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

Virat Kohli, Mitchell Starc, No Look Six: కోల్‌కత్తా నైట్‌ రైడర్సతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయినా.. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ పరువును విరాట్‌ కోహ్లీ తీసి పడేశాడు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 22, 2024 | 10:20 AMUpdated Apr 22, 2024 | 10:20 AM
వీడియో: మ్యాచ్‌ ఓడిపోయినా.. మిచెల్‌ స్టార్క్‌ పరువు తీసిన కోహ్లీ!

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. చివరి బాల్‌ వరకు సూపర్‌ థ్రిల్లర్‌లా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అవుట్‌పై కూడా తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ అవుటైన బాల్‌ నో బాల్‌ అని, లేదు కరెక్ట్‌ బాల్‌ అంటూ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో రచ్చ కొనసాగుతూనే ఉంది. కాగా, కోహ్లీ అవుట్‌ వివాదంలో పడి.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసిన ఒక అద్భుతం తెరమరుగైపోయింది. కేకేఆర్‌ బౌలింగ్‌ యూనిట్‌లో మోస్ట్‌ వ్యాలుబుల్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌. ఆస్ట్రేలియాకు చెందిన ఈ దిగ్గజ బౌలర్‌ను కేకేఆర్‌ ఏకంగా 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర.

అంత ఎక్స్‌పెన్సీవ్‌ బౌలర్‌ పరువు తీశాడు విరాట్‌ కోహ్లీ. ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆర్సీబీ వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 223 పరుగుల భారీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన ఆర్సీబీ.. ఇన్నింగ్స్‌ను సూపర్‌ అగ్రెసివ్‌గా స్టార్ట్‌ చేసింది. విరాట్‌ కోహ్లీ తొలి ఓవర్‌ నుంచే కేకేఆర్‌పై విరుచుకుపడ్డాడు. ఇక రెండో ఓవర్‌ వేసేందుకు వచ్చిన మిచెల్‌ స్టార్క్‌కు ఊహించని షాక్‌ ఇచ్చిన కోహ్లీ.. ఆ ఓవర్‌లో స్టార్క్‌ పరువు తీశాడనే చెప్పాలి. స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి కోహ్లీ.. మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు.. అది కూడా బాల్‌ చూడకుండా.. దాన్ని క్రికెట్‌ అభిమానులంతా నో లుక్‌ సిక్స్‌గా అభివర్ణిస్తున్నారు.

ఇక ఇంటర్నేషన్‌ సూపర్‌ స్టార్‌ బౌలర్‌ను కోహ్లీ ఈ విధంగా నో లుక్‌ సిక్స్‌తో పరువు తీశాడంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. కాగా, ఐపీఎల్‌ చరిత్రలోనే స్టార్క్‌ అ‍త్యధిక ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. కానీ, మిచెల్‌ స్టార్క్‌ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుసగా విఫలం అవుతూనే ఉన్నాడు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా కేకేఆర్ ఓటమికి కారణం అయ్యేవాడే.. 21 పరుగులను డిఫెండ్‌ చేసే క్రమంలో చివరి ఓవర్‌ వేసిన స్టార్క్‌ ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. కరణ్‌ శర్మ స్టార్క్‌ బౌలింగ్‌లో మూడు భారీ సిక్సులు బాదాడు. దురదృష్టవశాత్తు ఐదో బంతికి కరణ్‌ అవుట్‌ అయ్యాడు కానీ, లేకుంటే.. స్టార్క్‌ కేకేఆర్‌ ఓటమికి కారణంగా నిలిచి, విమర్శల పాలయ్యేవాడు. మరి ఈ మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో కోహ్లీ నో లుక్‌ సిక్స్‌ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.