iDreamPost
android-app
ios-app

వీడియో: మ్యాచ్‌ గెలిచినా.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో డల్‌గా కోహ్లీ! ఎందుకింత బాధ?

  • Published May 10, 2024 | 10:40 AM Updated Updated May 10, 2024 | 10:48 AM

Virat Kohli, RCB vs PBKS, IPL 2024: పంజాబ్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌చేసి ఆర్సీబీని గెలిపించిన తర్వాత కూడా విరాట్‌ కోహ్లీ చాలా డల్‌గా డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా డల్‌గా కనిపించాడు. మరి దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, RCB vs PBKS, IPL 2024: పంజాబ్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌చేసి ఆర్సీబీని గెలిపించిన తర్వాత కూడా విరాట్‌ కోహ్లీ చాలా డల్‌గా డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా డల్‌గా కనిపించాడు. మరి దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 10, 2024 | 10:40 AMUpdated May 10, 2024 | 10:48 AM
వీడియో: మ్యాచ్‌ గెలిచినా.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో డల్‌గా కోహ్లీ! ఎందుకింత బాధ?

ఈ సీజన్‌లో ఆర్సీబీ వరుసగా నాలుగో విజయం సాధించింది. గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 92 పరుగులతో చెలరేగడంతో 241 పరుగుల భారీ స్కోర్‌ చేసిన ఆర్సీబీ.. ఆ తర్వాత పంజాబ్‌ను కేవలం 181 పరుగులకే ఆలౌట్‌ చేసి.. బంపర్‌ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది ఆర్సీబీ.. ఈ సీజన్‌ మొదటి నుంచి అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్న కోహ్లీ.. అదే కన్సిస్టెన్సీ చూపిస్తూ.. ఈ మ్యాచ్‌లో కూడా 47 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో 92 పరుగుల చేసి.. కొద్దిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. కానీ, టీమ్‌ మ్యాచ్‌ను భారీ తేడాతో గెలవడంతో ఆర్సీబీ ఫ్యాన్స​ అంతా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

కానీ, కోహ్లీ మాత్రం డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా డల్‌గా కనిపించాడు. మ్యాచ్‌ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన సెలబ్రేషన్‌ వీడియోను ఆర్సీబీ రిలీజ్‌ చేసింది. ఈ వీడియోలో కోహ్లీ డల్‌గా ఉండడాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎప్పుడూ సూపర్‌ ఎనర్జిటిక్‌గా ఉండే కోహ్లీ.. పంజాబ్‌పై మ్యాచ్‌ గెలిచినా కూడా అస్సలు హ్యాపీగా లేడని ఆ వీడియోలో కోహ్లీని చూస్తే అర్థమవుతుంది. అయితే.. సెంచరీ మిస్‌ అయినందుకు కోహ్లీ డల్‌గా ఉన్నాడా అంటే.. అదీ కాదు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు కోహ్లీ. అయినా.. ఈ మ్యాచ్‌లో స్ట్రైక్‌రేట్‌పై ఎక్కువ ఫోకస్‌ చేసిన కోహ్లీ.. సెంచరీ గురించి పెద్దగా ఆలోచించలేదు. అవుట్‌ అయినా పర్వాలేదని చివర్లో భారీ షాట్లను రిస్క్‌ తీసుకుని మరీ ఆడాడు.

47 బంతుల్లో 92 రన్స్‌ అంటే చాలా మంచి ఇన్నింగ్స్‌, మ్యాచ్‌ కూడా గెలిచారు.. అయినా కూడా కోహ్లీ ఎందుకు డల్‌గా ఉన్నాడంటే.. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరంభంలో చాలా చెత్త ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తొలి 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కటే విజయం సాధించింది. ఆ తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు విజయాలు సాధించింది. అయినా ఏం లాభం ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం కష్టమే. ఐపీఎల్‌ ట్రోఫీ కొట్టాలని 17 ఏళ్లగా కోహ్లీ పరితపిస్తున్నాడు. ట్రోఫీ కోసం తన కెప్టెన్సీని కూడా త్యాగం చేశాడు. జట్టు కోసం తన హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్‌ ఇస్తున్నాడు. అయినా.. టీమ్‌ సరిగ్గా ఆడటం లేదు. టోర్నీ ఆరంభంలో కోహ్లీ ఒక్కడే బ్యాటింగ్‌ భారాన్ని మోసాడు, ఇప్పుడు కూడా అతనే మోస్తున్నాడు. ఎంత ఆడినా కానీ, ఆర్సీబీతో కప్పు కొట్టించలేకపోతున్నాను అనే బాధ కోహ్లీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు గెలుస్తున్న ఈ మ్యాచ్‌లో తన సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ కోసం ఆడుతున్నాం అని ఇప్పటికే కోహ్లీ ప్రకటించాడు. ఉపయోగం లేని ఈ మ్యాచ్‌లు గెలిచి.. సెలబ్రేట్‌ చేసుకోవడంలో అర్థం లేదని భావించి.. మిగతా ఆటగాళ్లు అంతా ఆర్సీబీ యాంథమ్‌ను పాడుతుంటే.. తన మాత్రం డల్‌గా ఏదో నామ్‌కే వాస్త అన్నట్లు వారితో పాటు నిల్చున్నాడు. మరి కోహ్లీ ఇంత డల్‌పై ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.