iDreamPost

వీడియో: కోహ్లీ అవుటై వెళ్తున్న సమయంలో ఏం జరిగిందో గమనించారా? లైవ్‌లో చూపించలేదు!

  • Published Jun 13, 2024 | 11:28 AMUpdated Jun 13, 2024 | 11:28 AM

Virat Kohli, T20 World Cup 2024, IND vs USA: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ గోల్డెన్‌ డక్‌ అయి.. పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, T20 World Cup 2024, IND vs USA: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ గోల్డెన్‌ డక్‌ అయి.. పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 13, 2024 | 11:28 AMUpdated Jun 13, 2024 | 11:28 AM
వీడియో: కోహ్లీ అవుటై వెళ్తున్న సమయంలో ఏం జరిగిందో గమనించారా? లైవ్‌లో చూపించలేదు!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా మూడో విజయం సాధించింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియంలో యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్‌లో అర్షదీప్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా దమ్మురేపడంతో పసికూన యూఎస్‌ఏ 110 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి హేమాహేమీ బ్యాటర్లు వెంటవెంటనే అవుటై కాస్త కంగారు పెట్టినా.. సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే నిలకడగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ గోల్డెన్‌ డక్‌ అవ్వడం భారత క్రికెట్‌ క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. అలాగే కోహ్లీ అవుటై వెళ్తు చేసిన పని మరింత బాధ పెట్టేలా ఉంది.

విరాట్‌ కోహ్లీ అవుట్‌ అయిన తర్వాత పెవిలియన్‌కు వెళ్తూ చేసిన ఒక పని నిన్న మ్యాచ్‌ లైవ్‌లో కూడా చూపించలేదు. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ కోహ్లీ అవుటై వెళ్తూ ఏం చేశాడంటూ.. యూఎస్‌ఏ బౌలర్‌ సౌరభ్‌ నేత్రవాల్కర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి రెండో బంతికే వికెట్‌ కీపర్‌ ఆండ్రీస్ గౌస్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు కోహ్లీ. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్‌ కావడంతో భారత క్రికెట్‌ అభిమానులు, నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ సైతం షాక్‌ అయ్యారు. అయితే.. తాను ఆ బంతిని అలా ఎలా ఆడాను? అసలేంటీ ఈ పిచ్‌ అన్నట్లు కోహ్లీ అవుటై వెళ్తూ.. పిచ్‌ను అలాగే చూస్తూ ముందుకు అడుగులు వేశాడు. ఈ సీన్స్‌ చూసి.. కోహ్లీని ఎప్పుడూ ఇలా చూడలేదంటూ భారత క్రికెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోహ్లీ మళ్లీ ఫామ్‌ పుంజుకుంటాడని, పరుగులు సాధిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్టీవెన్‌ టేలర్‌ 24, ఎన్‌ఆర్‌ కుమార్‌ 27 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 4 వికెట్లతో అదరగొట్టాడు. హార్ధిక్‌ పాండ్యా 2, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక 111 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే రాణించి విజయం అందించారు. కోహ్లీ 0, రోహిత్‌ 3 రన్స్‌ మాత్రమే చేసి నిరాశపర్చారు. పంత్‌ 18, సూర్య 50, దూబే 31 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో నేత్రవాల్కర్‌ 2 వికెట్లతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ అవుటై వెళ్తూ.. పిచ్‌ను తదేకంగా చూడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి