Nidhan
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన బెస్ట్ ఇచ్చాడు. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. తుదిపోరులో మాత్రం అంతా తానై భారత ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన బెస్ట్ ఇచ్చాడు. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. తుదిపోరులో మాత్రం అంతా తానై భారత ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 మొదలవడానికి ముందు టీమిండియా ఆశలన్నీ విరాట్ కోహ్లీ మీదే పెట్టుకుంది. ఐపీఎల్-2024లో అతడు టాప్ స్కోరర్‌గా నిలవడం, పొట్టి కప్పుకు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా-వెస్టిండీస్ పిచ్‌లు అతడి బ్యాటింగ్‌కు సరిపోవడంతో కింగ్ బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. అతడే లీడింగ్ స్కోరర్ అవుతాడని భావించారు. కానీ టోర్నీలో అతడి ఫ్లాప్ షో నడిచింది. ఫైనల్ మ్యాచ్ వరకు కింగ్ వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఆడిన 7 మ్యాచుల్లో కలిపి 75 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీ పనైపోయిందనే విమర్శలు ఊపందుకున్నాయి. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా కోచ్ రాహుల్ ద్రవిడ్ తదితరులు మాత్రం అతడికి సపోర్ట్‌గా నిలిచారు.
కోహ్లీ నుంచి ఇంకా బెస్ట్ రావాల్సి ఉందని, బహుశా ఫైనల్ మ్యాచ్ కోసం అతడు దాన్ని దాచి ఉంచాడంటూ రోహిత్, ద్రవిడ్ చెప్పారు. వాళ్ల మాటే నిజమైంది. తుదిపోరులో కోహ్లీ తన బెస్ట్ ఇచ్చాడు. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. టైటిల్ ఫైట్‌లో మాత్రం అంతా తానై భారత ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. రోహిత్, సూర్యకుమార్, పంత్ ఔటైన దశలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతల్ని భుజాల మీద వేసుకున్నాడు. ఒక్కో రన్‌తో స్కోరు బోర్డును నడిపిస్తూ ఆఖర్లో విధ్వంసక షాట్లతో విరుచుకుపడ్డాడు. విరాట్ ఆడకపోతే మ్యాచ్‌లో రిజల్ట్ మరోలా ఉండేది. అందుకే అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం కోహ్లీకి ఈ పురస్కారం ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నాడు.
కోహ్లీ వల్ల ఫైనల్లో గెలవలేదని, ఈ విజయంలో అసలు క్రెడిట్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ లాంటి బౌలర్లకు ఇవ్వాలన్నాడు మంజ్రేకర్. వీళ్ల వల్లే మ్యాచ్ టర్న్ అయిందని, కోహ్లీ ఇన్నింగ్స్‌కు విలువ కూడా ఈ ప్లేయర్లు రాణించడం వల్లే దక్కిందన్నాడు. విరాట్‌కు కాకుండా ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చి ఉండే బాగుండేదన్నాడు మంజ్రేకర్. ఆఖరి ఓవర్లో మ్యాచ్‌ను టర్న్ చేసిన హార్దిక్‌తో పాటు మిగిలిన బౌలర్లే రియల్ హీరోస్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఒకదశలో సౌతాఫ్రికా గెలిచేందుకు 90 శాతం అవకాశాలు ఉన్నాయని, భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారని.. అక్కడి నుంచి బౌలర్లే మ్యాచ్‌ను మన వైపు తిప్పారన్నాడు. కోహ్లీ చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడంటూ విమర్శించాడు. మరి.. బౌలర్లలో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందంటూ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య భారత మాజీ హెడ్ కోచ్.. సచిన్‌ను సానబెట్టినోడు!
Sanjay Manjrekar “India was in a losing position.The turnaround actually saved Virat Kohli’s innings bcz he played virtually half the innings with a strike-rate of 128,My man of the match would’ve been a bowler bcz they actually took the game from defeat”pic.twitter.com/Ri7Wz2hMBp
— Sujeet Suman (@sujeetsuman1991) July 2, 2024