iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీకి గాయాలు! ఇన్‌స్టా స్టోరీపై క్లారిటీ

  • Published Nov 27, 2023 | 2:05 PM Updated Updated Nov 27, 2023 | 2:05 PM

అసలే వరల్డ్‌ కప్‌ ఒక్క మ్యాచ్‌తో పోయిందన్న బాధలో ఉన్న భారత క్రికెట్‌ అభిమానులకు మరో వార్త మరింత బాధిస్తోంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి గాయాలు అయ్యాయని వార్త దావానంలా వ్యాపిస్తోంది. అయితే.. ఆ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అసలే వరల్డ్‌ కప్‌ ఒక్క మ్యాచ్‌తో పోయిందన్న బాధలో ఉన్న భారత క్రికెట్‌ అభిమానులకు మరో వార్త మరింత బాధిస్తోంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి గాయాలు అయ్యాయని వార్త దావానంలా వ్యాపిస్తోంది. అయితే.. ఆ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 27, 2023 | 2:05 PMUpdated Nov 27, 2023 | 2:05 PM
విరాట్‌ కోహ్లీకి గాయాలు! ఇన్‌స్టా స్టోరీపై క్లారిటీ

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి గాయాలు అయినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఓటమితో తీవ్ర బాధలో ఉన్న భారత క్రికెట్‌ అభిమానులకు ఇప్పుడు.. కోహ్లీ గాయాల విషయం మరింత షాక్‌కు గురి చేసింది. వరల్డ్‌ కప్‌ తర్వాత.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు చాలా మంది ఆటగాళ్లకు రెస్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కోహ్లీకి కూడా సెలెక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. దీంతో.. అతను తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ గాయాల పాలయ్యాడనే వార్తలు వస్తున్నాయి.

గాయాలతో ఉన్న కోహ్లీ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన కోహ్లీ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. కోహ్లీకి అసలు గాయాలు ఎలా అయ్యాయని అంతా కంగారు పడుతున్నారు. అయితే.. అవి నిజమైన గాయాలు కావని సమాచారం. ఒక యాడ్‌ షూట్‌లో భాగంగా కోహ్లీకి గాయాలు అయినట్లు మేకప్‌ వేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ ఫొటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో స్టోరీగా పెట్టడంతో అసలు విషయం బయటపడింది. లేకుంటే.. కోహ్లీకి నిజంగానే గాయాలు అయ్యాయని చాలా మంది అభిమానులు ఆందోళన చెందేవారు. పూమా యాడ్‌ షూట్‌లో భాగంగా కోహ్లీకి అలా మేకప్‌ వేశారని తెలిసిన తర్వాత.. ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఆ ఫొటో విషయం పక్కనపెడితే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా కప్పు గెలిచేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయినా.. కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే తొలి ఒక వన్డే వరల్డ్‌ కప్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వరల్డ్‌ కప్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. ఏకంగా 765 పరుగులు చేసి టోర్నీలోనే టాప్‌ రన్‌ గెట్టర్‌గా నిలిచాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు కూడా కోహ్లీనే వరించింది. ఈ ప్రదర్శనతో 2003 వరల్డ్‌ కప్‌లో సచిన్‌ టెండూల్కర్‌ నెలకొల్పిన 673 పరుగుల రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేసి.. కొత్త చరిత్ర లిఖించాడు. అలాగే వన్డేల్లో సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కూడా కోహ్లీ అధికమించిన విషయం తెలిసిందే. మరి కోహ్లీ రికార్డులతో పాటు.. తాజాగా గాయాల ఫొటో వైరల్‌ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.