వీడియో: అశ్విన్ స్పిన్ మ్యాజిక్​కు షాకైన కోహ్లీ.. ఆ ఎక్స్​ప్రెషనే అంతా చెబుతోంది!

Virat Kohli, Ravichandran Ashwin, IND vs BAN: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తడాఖా ఏంటో మరోమారు రుచి చూపించాడు. బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్​తో హీరోగా నిలిచాడు.

Virat Kohli, Ravichandran Ashwin, IND vs BAN: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తడాఖా ఏంటో మరోమారు రుచి చూపించాడు. బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్​తో హీరోగా నిలిచాడు.

టీమిండియాను ఓడిస్తామంటూ ఓవరాక్షన్ చేసిన బంగ్లాదేశ్ పరువు పోగొట్టుకుంది. చెన్నై టెస్ట్​లో భారత్ చేతుల్లో ఏకంగా 280 పరుగుల భారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. పాకిస్థాన్​ను వైట్​వాష్ చేసేశాం, రోహిత్ సేనను కూడా ఓడిస్తామంటూ బిల్డప్ ఇచ్చిన బంగ్లా.. మన జట్టు ముందు నిలబడలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అన్ని విభాగాల్లోనూ ఫెయిలైన ఆ జట్టు.. రోహిత్ సేన ముందు బెండ్ అయింది. శుబ్​మన్ గిల్, రిషబ్ పంత్ సూపర్ సెంచరీలతో మెరిసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. రవీంద్ర జడేజా మంచి నాక్ ఆడటంతో పాటు బౌలింగ్​లోనూ సత్తా చాటాడు. అయితే ఎక్కువ క్రెడిట్ మాత్రం వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​కు దక్కుతుంది. సెంచరీ బాదడమే గాక 6 వికెట్లు తీసి బంగ్లాను చావుదెబ్బ తీశాడు.

సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్​లోనూ సత్తా చాటి 6 వికెట్లు తీసిన అశ్విన్​కు ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో అంతా అతడి గురించే డిస్కస్ చేస్తున్నారు. అశ్విన్ టీమ్​కు ఎంత కీలకమో మాట్లాడుకుంటున్నారు. మ్యాచ్ నిన్ననే కంప్లీట్ అయినా అశ్విన్​ స్పిన్ మ్యాజిక్, బ్యాటంగ్ సక్సెస్​ గురించి ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇదే తరుణంలో తొలి టెస్టులో అతడు తీసిన ఓ వికెట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్​లో మోమినుల్ హక్​ను అతడు క్లీన్​బౌల్డ్ చేసిన విధానం మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది. అయితే ఈ డిస్మిసల్ కంటే దానికి విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ఇంకా వైరల్​గా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

515 పరుగుల టార్గెట్​తో సెకండ్ ఇన్నింగ్స్​ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ ఒక దశలో వికెట్ కోల్పోకుండా 60 పరుగులతో పటిష్టంగా ఉంది. కానీ మరో 60 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్​లో క్రీజులోకి వచ్చిన మోమినుల్ 24 బంతుల్లో 13 పరుగులతో సెటిల్ అయినట్లే కనిపించాడు. కానీ మంచి డెలివరీతో అతడి పని పట్టాడు అశ్విన్. గుడ్ లెంగ్త్​లో పడిన బంతి టర్న్ అయి అతడి డిఫెన్స్​ను ఛేదించుకొని వికెట్లను గిరాటేసింది. బ్యాట్‌ ఔట్ ఎడ్జ్ బీట్ అయి మరీ స్టంప్స్​ను పడేసిందా బాల్. అది యాంగిల్​తో వచ్చిన విధానం, పిచ్ మీద పడి టర్న్ అవడం, బ్యాట్ ఎడ్జ్​ను ఛేదించుకొని వికెట్లను పడేసిన తీరుకు బ్యాటర్ సహా ఫీల్డర్ కోహ్లీ షాక్ అయ్యాడు. ఏం బంతిరా బాబు అంటూ విచిత్రమైన ఎక్స్​ప్రెషన్ ఇచ్చాడు. ఇదే డెలివరీ కాదు.. మ్యాచ్ పూర్తయ్యాక కూడా అశ్విన్​ బౌలింగ్, బ్యాటింగ్​ను మెచ్చుకుంటూ కోహ్లీ మరో ఎక్స్​ప్రెషన్ ఇచ్చాడు. దీంతో విరాట్​ను అందరూ పొగుడుతున్నారు. ఇతర ఆటగాళ్లను మెచ్చుకోవడం, ఎంకరేజ్ చేయడం మంచి విషయమని.. అతడ్ని చూసి మిగతావాళ్లు నేర్చుకోవాలని అంటున్నారు.

Show comments