iDreamPost
android-app
ios-app

తిట్టినోళ్లే పొగుడుతున్నారు.. రోహిత్ సూపర్ సక్సెస్! ప్లానింగ్​ అంటే ఇది!

  • Published Sep 23, 2024 | 5:23 PM Updated Updated Sep 23, 2024 | 5:23 PM

Rohit Sharma, Gautam Gambhir, IND vs BAN: రోహిత్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతడికి ఏమైందని అన్నారు. హిట్​మ్యాన్​ది దూకుడు.. కోచ్ గంభీర్ అయినా హెచ్చరించాలి కదా అని కామెంట్స్ చేశారు. టీమిండియాకు ఓటమి తప్పదన్నారు. కానీ రోహిత్ సక్సెస్ చూసి తిట్టినోళ్లే పొగుడుతున్నారు.

Rohit Sharma, Gautam Gambhir, IND vs BAN: రోహిత్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతడికి ఏమైందని అన్నారు. హిట్​మ్యాన్​ది దూకుడు.. కోచ్ గంభీర్ అయినా హెచ్చరించాలి కదా అని కామెంట్స్ చేశారు. టీమిండియాకు ఓటమి తప్పదన్నారు. కానీ రోహిత్ సక్సెస్ చూసి తిట్టినోళ్లే పొగుడుతున్నారు.

  • Published Sep 23, 2024 | 5:23 PMUpdated Sep 23, 2024 | 5:23 PM
తిట్టినోళ్లే పొగుడుతున్నారు.. రోహిత్ సూపర్ సక్సెస్! ప్లానింగ్​ అంటే ఇది!

రోహిత్ శర్మ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతడికి ఏమైందని ప్రశ్నించారు. బంగ్లాదేశ్​కు భయపడుతున్నారంటూ విమర్శించారు. ఆ టీమ్​కు భయపడి ఇంత రిస్క్ అవసరమా? మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. హిట్​మ్యాన్​ దూకుడుగా ఉన్నాడు సరే.. కోచ్ గౌతం గంభీర్ అయినా అతడికి సర్దిచెప్పాలి కదా.. ఓడిపోతే ఎవరు బాధ్యులని క్వశ్చన్ చేశారు. రోహిత్-గంభీర్​ తప్పు చేస్తున్నారని.. ఇలాంటి పని ఎలా చేస్తారంటూ తిట్టారు. కానీ ఇప్పుడు అవే నోళ్లు ఆ ఇద్దర్నీ పొగుడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హిట్​మ్యాన్​ను ప్రశంసిస్తున్నాయి. అతడు చేసిన రిస్కే జట్టుకు భారీ విజయాన్ని అందించిందని మెచ్చుకుంటున్నాయి. అసలు ఏం జరిగింది? రోహిత్ ఏ విషయంలో తిట్లు తిన్నాడు? ఎందుకు అందరూ అతడ్ని ప్రశంసిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్ మొదలవడానికి ముందు కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ కలసి ఓ వినూత్న ఆలోచన చేశారు. ఈ సిరీస్​లో తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నై వికెట్ స్వతహాగా స్పిన్​కు అనుకూలిస్తుంది. స్పిన్ అస్త్రంతో ఇక్కడ ఎన్నో మ్యాచుల్లో గెలిచిన ట్రాక్ రికార్డు భారత్​కు ఉంది. కానీ రోహిత్-గౌతీ ద్వయం చెన్నై పిచ్​ను పేస్ వికెట్​గా మార్చాలని డిసైడ్ చేశారు. నల్ల మట్టికి బదులు ఎర్రమట్టి పిచ్​ను తయారు చేయించారు. అయితే వాళ్లిద్దరూ అలా చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. టీమిండియా సొంతగడ్డపై ఆడే టెస్టు మ్యాచుల్లో దాదాపుగా స్పిన్ పిచ్​లనే రూపొందిస్తారు. కానీ స్పిన్​ వేయడంలోనూ, ఆడటంలోనూ బంగ్లాదేశ్ ఆరితేరింది. అలాగే ఇటీవల పాకిస్థాన్​ను వైట్​వాష్​ చేయడంతో ఆ టీమ్ ఫుల్ జోష్​లో ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో భారత బ్యాటర్లు స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నారు. అటు బంగ్లా టీమ్​లో మంచి క్వాలిటీ స్పిన్నర్లు ఉండటంతో చెన్నై పిచ్ విషయంలో గంభీర్-రోహిత్ డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్లారు.

సిరీస్​లోని ఫస్ట్ మ్యాచ్​లోనే స్పిన్ వికెట్ సిద్ధం చేస్తే బంగ్లాదేశ్ మరింత రెచ్చిపోయి ఆడే ప్రమాదం ఉంది. అందుకే చెపాక్ పిచ్​ను పేస్ ఫ్రెండ్లీగా మార్చాడు రోహిత్. అదే టైమ్​లో ఆ జట్టు ఇది స్పిన్ ట్రాక్ అనుకొని వస్తుంది. పేస్ వికెట్ అని తెలిశాక అడ్జస్ట్ అయి ఆడేలోపు వాళ్ల కథ ముగించొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెడ్ సాయిల్​తో పిచ్ తయారు చేయించాడు. ఇది భలేగా వర్కౌట్ అయింది. మన బ్యాటర్లు దీనికి మొదటి ఇన్నింగ్స్​లో ఇబ్బంది పడినా.. ఆ తర్వాత అలవాటు పడ్డారు. అశ్విన్​తో పాటు గిల్, పంత్ సెంచరీలు బాదారు. జడేజా దాదాపుగా మూడంకెల స్కోరును టచ్ చేశాడు.

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా, ఆకాశ్​దీప్ 6 వికెట్లతో తొలి ఇన్నింగ్స్​లో బంగ్లాను కుప్పకూల్చారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్​లో స్పిన్​కు సపోర్ట్ లేకపోయినా వేరియేషన్స్​తో ఆ జట్టు కథ ముగించాడు అశ్విన్. అంతా రాణించడంతో మెన్ ఇన్ బ్లూ 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. రోహిత్ పేస్ వికెట్ ఐడియా వర్కౌట్ అవడంతో అతడ్ని అంతా మెచ్చుకుంటున్నారు. అతడిది భయం కాదు.. డేరింగ్ అని, బంగ్లాను బుర్ర వాడి బోల్తా కొట్టించాడని అంటున్నారు. మన బ్యాటర్లు, బౌలర్ల టాలెంట్ మీద నమ్మకంతో అతడు ధైర్యం చేసి ఇలాంటి వికెట్ తయారు చేయించాడని చెబుతున్నారు. ప్లానింగ్ అంటే ఇది, రోహిత్ మామూలోడు కాదంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మరి.. రోహిత్ పేస్ వికెట్ ఐడియా వర్కౌట్ అవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler