SNP
Virat Kohli, Rilee Rossouw, RCB vs PBKS, IPL 2024: కచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్ చతికిలపడితే.. ఆర్సీబీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ స్టార్ క్రికెటర్ పరువుతీశాడు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Virat Kohli, Rilee Rossouw, RCB vs PBKS, IPL 2024: కచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్ చతికిలపడితే.. ఆర్సీబీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ స్టార్ క్రికెటర్ పరువుతీశాడు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 60 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ చేతులెత్తేస్తే.. ఆర్సీబీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మరేపి.. ఇంకా తాము ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నామని గట్టి వార్నింగ్ ఇచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగగా, అతనికి తోడు యువ క్రికెటర్ రజత్ పాటిదార్, కామెరున్ గ్రీన్ సైతం బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత పంజాబ్‌తో 181కే కట్టడి చేసి మ్యాచ్‌ను గెలిపించారు ఆర్సీబీ బౌలర్లు.
అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ స్టార్ ప్లేయర్ పరువుతీశాడు విరాట్ కోహ్లీ. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే షాకిచ్చింది ఆర్సీబీ. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్‌ను స్వప్నిల్ సింగ్ అవుట్ చేశాడు. కానీ, వన్ డౌన్‌లో వచ్చిన రిలీ రోసోవ్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వచ్చి రావడంతోనే రెండు వరుస బౌండరీల ఎటాకింగ్ గేమ్ ఆడాడు. మొత్తంగా 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 61 పరుగులు చేసి అదరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. తన ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్ గాల్లోకి గన్ పేల్చుతున్నట్లు బ్యాట్‌తో పోజ్ పెట్టి.. సెలబ్రేట్ చేసుకున్నాడు. కరణ్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి.. విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోసోవ్.. కీలక వికెట్ పడటంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి.. రోసోవ్ ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్‌ను కాపీ చేశాడు. ఇది ఒక రకంగా రోసోవ్‌కు కౌంటర్. కోహ్లీ నుంచి ఇలాంటి అగ్రెసివ్ మూమెంట్స్ కొత్తేం కాదని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 92, రజత్ పాటిదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 55, కామెరున్ గ్రీన్ 27 బంతుల్లో 46 పరుగులు చేసి అదరగొట్టారు. డుప్లెసిస్, విల్ జాక్స్ తక్కువ స్కోర్‌కే అవుటై నిరాశపర్చారు. డీకే 7 బంతుల్లో 18 రన్స్ చేసి.. వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కావేరప్ప 2, అర్షదీప్ సింగ్, సామ్ కరన్ చెరో వికెట్ తీశారు. ఇక 242 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రిలీ రోసోవ్ 61, శశాంక్ సింగ్ 37 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 3, స్వప్నిల్ సింగ్ 2, ఫెర్గుసన్ 2, కరణ్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పంజాబ్ ఎలిమినేట్ అయిపోయింది. ముంబై తర్వాత.. ఎలిమినేట్ అయిన రెండో టీమ్‌గా పంజాబ్ నిలిచింది. మరి ఈ మ్యాచ్‌లో రోసోవ్‌ను కోహ్లీ ఇమిటేట్ చేసి.. కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
For Every Action There Is Equal And Opposite Reaction.
What A Electrifying RunOut!!
KING KOHLI MANIA EVERYWHERE ON THE FIELD.#RCBvPBKS #ViratKohli #PBKSvsRCB pic.twitter.com/5jRAy2fx5e
— 𝑺𝒉𝒂𝒉𝒃𝒂𝒛 (@shahbazyours) May 9, 2024