SNP
Virat Kohli, RCB vs KKR, IPL 2024: కేకేఆర్‌పై ఎలాగైన సత్తా చాటాలని భావించిన కోహ్లీకి నిరాశే ఎదురైంది. వివాదాస్పదమైన రీతిలో అవుటైన కోహ్లీ.. పెవిలియన్‌కు వెళ్తూ చేసిన పని ఒకటి వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, RCB vs KKR, IPL 2024: కేకేఆర్‌పై ఎలాగైన సత్తా చాటాలని భావించిన కోహ్లీకి నిరాశే ఎదురైంది. వివాదాస్పదమైన రీతిలో అవుటైన కోహ్లీ.. పెవిలియన్‌కు వెళ్తూ చేసిన పని ఒకటి వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిన దానికంటే.. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అవుట్‌పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. అది నో బాల్ అని కొంతమంది, కాదు లీగల్ డెలవరీ అంటూ మరికొంత మంది వాదిస్తున్నారు. ఏది ఏమైనా.. బీసీసీఐ రూల్స్ ప్రకారం అది నో బాల్ కాదని అంపైర్లు నిర్ధారించి.. అవుట్‌గా ఖరారు చేశారు. ఆ విషయంపై విరాట్ కోహ్లీ కూడా సీరియస్ అయ్యాడు. కానీ, ఆ తర్వాత అంపైర్లు తనతో మాట్లాడిన తర్వాత కూల్ అయ్యాడు. అయితే.. అవుట్ అయిన తర్వాత పెవిలియన్‌కు తిరిగి వెళ్తూ బౌండరీ లైన్ వద్ద కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బహుషా ఆ సీన్స్‌ను నిన్న మ్యాచ్ లైవ్ చూసిన వాళ్లు కూడా చూసి ఉండరు.
అసలింతకీ ఏం జరిగిందంటే.. 223 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను అగ్రెసివ్‌గా ఆరంభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో 6 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. దీంతో రెండు ఓవర్లలోనే ఆర్సీబీ 27 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడం పక్కా, కోహ్లీ బ్యాట్ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ రాబోతుందని చాలా మంది ఫిక్స్ అయ్యారు. కానీ, ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా.. ఆ ఓవర్ తొలి బంతినే భారీ బీమర్‌గా కోహ్లీ బాడీపైకి వేశాడు. ఆ ఊహించని విధంగా వచ్చిన ఆ బాల్‌ను కోహ్లీ డిఫెన్స్ ఆడాడు. అది కాస్త గాల్లోకి లేచింది. దాన్ని హర్షిత్ రాణా క్యాచ్‌గా అందుకున్నాడు. అయితే అది నో బాల్ అయి ఉంటుందని అంతా భావించారు. కేకేఆర్ ఆటగాళ్లు కూడా కోహ్లీ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే.. థర్డ్ అంపైర్ రీప్లేలో చూసి.. అది నో బాల్ కాదని, లీగల్ డెలవరీ అని ప్రకటించడంతో కోహ్లీ అవుట్ అయ్యాడు. బాల్ బ్యాట్‌కు తగిలే సమయానికి కోహ్లీ నడుము కంటే ఎత్తుగా వచ్చినా.. క్రీజ్‌లోకి వెళ్లే సమయానికి బాల్ డిప్ అయి కోహ్లీ నడుము కంటే తక్కువ ఎత్తులో ఉన్నట్లు బాల్ ట్రాకింగ్‌లో తేలడంతో అంపైర్లు దాన్ని లీగల్ డెలవరీగా పేర్కొంటూ.. కోహ్లీని అవుట్‌గా ఖరారు చేశారు.
అంపైర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై నిర్ఘాంతపోయిన విరాట్ కోహ్లీ.. గ్రౌండ్‌లోనే ఫీల్డ్ అంపైర్‌పై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. చాలా కోపంగా గ్రౌండ్ వీడాడు. ఈ క్రమంలోనే బౌండరీ లైన్ వద్ద ఉన్న డస్ట్‌బిన్‌ను కోపంగా చేత్తో కొట్టాడు. అది వెళ్లి అంత దూరంలో పడింది. ఈ ఘటన చూసిన క్రికెట్ అభిమానులు.. కోహ్లీ కోపంలో అర్థం ఉందని, ఆ బాధ అలాంటిది అంటూ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ అవుటైనా.. విల్ జాక్స్, రజత్ పాటిదార్ అద్భుతంగా ఆడి.. ఆర్సీబీని విజయం దిశగా నడిపించారు. వారిద్దరూ వెంటవెంటనే అవుట్ అయినా.. ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్ మ్యాచ్‌ను గెలిపించే కనిపించారు. కానీ, డీకే అవుట్ కావడం, చివరి ఓవర్‌లో కరణ్ శర్మ మూడు సిక్సులతో అదరగొట్టినా.. ఆర్సీబీ విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచిపోయింది. ఈ ఓటమితో ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లే. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ అవుట్‌పై, అలాగే అతని కోపంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.