iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ కంటే ఇషాన్‌ కిషన్‌ ఎందులో బెటర్‌? BCCI తప్పు చేస్తోందా?

  • Published Dec 09, 2023 | 12:20 PM Updated Updated Dec 09, 2023 | 1:03 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ టీ20 కెరీర్‌ ముగిసిపోయినట్లు.. కొన్ని వార్తలు వస్తున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో అతని స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌ ఆక్రమిస్తాడని కూడా అంటున్నారు. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ టీ20 కెరీర్‌ ముగిసిపోయినట్లు.. కొన్ని వార్తలు వస్తున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో అతని స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌ ఆక్రమిస్తాడని కూడా అంటున్నారు. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 09, 2023 | 12:20 PMUpdated Dec 09, 2023 | 1:03 PM
Virat Kohli: కోహ్లీ కంటే ఇషాన్‌ కిషన్‌ ఎందులో బెటర్‌? BCCI తప్పు చేస్తోందా?

సౌతాఫ్రికాతో సిరీస్‌ కంటే ముందు.. భారత క్రికెట్‌ అభిమానుల్లో ఓ చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం టీమ్‌ను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రక్రియ మొదలుపెట్టినట్లు పలు రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని టీ20 క్రికెట్‌కు దూరం పెట్టేందుకు బీసీసీఐ భావిస్తున్నట్లు.. అతని స్థానంలో టీ20ల్లో మూడో స్థానం కోసం ఇషాన్‌ కిషన్‌ను ఆడించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విరాట్‌ కోహ్లీ అభిమానులతో పాటు, కొంతమంది భారత క్రికెట్‌ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 క్రికెట్‌ నుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లీని ఎలా తప్పిస్తారని మండిపడుతున్నారు.

ఈ రకంగా చూసినా.. విరాట్‌ కోహ్లీ కంటే ఇషాన్‌ కిషన్‌ బెస్ట్‌ ఆప్షన్‌ కాదని అంటున్నారు. కాగా, కోహ్లీ స్థానంలో కిషన్‌ను తీసుకోవడం విషయంలో.. మెరుగైన స్ట్రైక్‌రేట్‌ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీ20ల్లో మూడో స్థానంలో ఆడే ప్లేయర్‌ మంచి స్ట్రైక్‌ రేట్‌తో అగ్రెసివ్‌గా ఆడాలని అందుకే కోహ్లీకి బదులు ఇషాన్‌ కిషన్‌ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ, టీమిండియా సెలెక్టర్లు, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ఇషాన్‌ కిషన్‌ను ఫైనల్‌ చేసేందుకు సమ్మతించినట్లు కూడా సమాచారం. అయితే.. ఇక్కడే వారంతా తప్పు చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎంత ఫాస్ట్‌ ఫార్వడ్‌ లాంటి ఫార్మాట్‌ అయినా.. పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పుతూ.. వికెట్లు కాపాడే బ్యాటర్‌ చాలా అవసరం.

virat

పైగా వీళ్లంతా చెబుతున్న స్ట్రైక్‌ రేట్‌ అంశాన్నే తీసుకుంటే.. టీ20ల్లో ఇషాన్‌ కిషన్‌ స్ట్రైక్‌రేట్‌ కంటే కూడా విరాట్‌ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ అధికంగా ఉంది. ఈ విషయం విని చాలా మంది షాక్‌కి గురై ఉంటారు. అయినా కూడా ఇదే నిజం. టీ20 క్రికెట్‌లో కోహ్లీ స్ట్రైక్‌ రేట్‌ 137.97 కాగా, ఇషాన్‌ కిషన్‌ది కేవలం.. 124.38. ఇందులో కూడా కోహ్లీనే ముందున్నాడు. అయినా కూడా స్ట్రైక్‌రేట్‌ కోసం ఇషాన్‌ను తీసుకుంటారని అనుకోవడం విడ్డూరంగా ఉంది. ఇషాన్‌ యంగ్‌ క్రికెటర్‌.. ఓపెనర్ల వికెట్లు ఆరంభంలోనే పడితే.. ఆ ఒత్తడిని కోహ్లీ కంటే మెరుగ్గా ఎవరూ హ్యాండిల్‌ చేయలేరు. అలాగే 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సి దశలో ఎలా ఆడాలో కూడా కోహ్లీ కంటే ఎవరికీ బాగా తెలియదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచే అందుకు చక్కటి ఉదాహరణ. ఇవన్నీ మర్చిపోయి.. స్ట్రైక్‌రేట్‌ కోసం కోహ్లీని పక్కన పెట్టి ఇషాన్‌ను మూడో స్థానంలో ఆడిస్తారని కొంతమంది అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.