Virat Kohli: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ విజయం.. అసలైనోడికి క్రెడిట్‌ ఇచ్చిన కోహ్లీ!

Virat Kohli, Jasprit Bumrah, T20 World Cup 2024: భారత దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఓ ప్లేయర్‌ను ఆకాశానికెత్తేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ విజయానికి అతనికే క్రెడిట్‌ ఇచ్చాడు. మరి కోహ్లీ చెప్పిన ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Jasprit Bumrah, T20 World Cup 2024: భారత దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఓ ప్లేయర్‌ను ఆకాశానికెత్తేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ విజయానికి అతనికే క్రెడిట్‌ ఇచ్చాడు. మరి కోహ్లీ చెప్పిన ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత రెండో సారి భారత్‌ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఎప్పుడెప్పుడో 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ను ధోని సారథ్యంలో గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇన్నేళ్లకు రెండోసారి పొట్టి ప్రపంచ కప్‌ను గెలిచింది. ఆ సమయంలో రోహిత్‌ శర్మ భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. యంగ్‌ ప్లేయర్‌గా టీ20 వరల్డ్‌ కప్‌ సాధించిన రోహిత్‌.. ఇప్పుడు కెప్టెన్‌గా ట్రోఫీని అందుకున్నాడు. ఈ ప్రపంచ కప్‌ గెలవడంలో అందరి కృషి ఉన్నా.. ఓ ఆటగాడికి స్పెషల్‌ క్రెడిట్‌ ఇచ్చాడు టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోహ్లీ ఓ ప్లేయర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో జట్టులోని ఆటగాళ్లంతా తమ శక్తి మేరా రాణించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా, పంత్‌, కుల్డీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ ఇలా అంతా ఏదో ఒక మ్యాచ్‌ను గెలిపించారు. అలాగే విరాట్‌ కోహ్లీ టోర్నీ ఆరంభం నుంచి విఫలమైనా.. కీలకమైన ఫైనల్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. 76 పరుగులతో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిందరికీ మించి ఫైనల్‌లో టీమిండియా మ్యాచ్‌ గెలిచిందంటే కారణం జస్ప్రీత్‌ బుమ్రా. సౌతాఫ్రికా విజయం ఖాయం అనుకున్న దశలో.. వాళ్ల విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో.. చివరి 5 ఓవర్లలో 2 ఓవర్లు వేసి.. కేవలం 6 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసి.. మ్యాచ్‌ను మనవైపు తిప్పేశాడు.

ఇదే విషయాన్ని కోహ్లీ.. వాంఖడేలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రస్తావిస్తూ.. ‘బుమ్రా ఇండియా తరఫున ఆడటం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.. ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఐదు ఓవర్లలో రెండు ఓవర్లు వేసి మ్యాచ్‌ను టర్న్‌ చేశాడు. అందుకే.. బుమ్రాను అంతా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి’ అంటూ బుమ్రాకు ఫైనల్‌ విక్టరీ క్రెడిట్‌ ఇచ్చాడు కోహ్లీ. ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌ అనే కాదు.. టోర్నీ ఆసాంతం బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. చాలా మ్యాచ్‌లు టీమిండియా బౌలింగ్‌ బలంతోనే గెలిచింది. బుమ్రాకు పాండ్యా, సిరాజ్‌, కుల్దీప్‌, అర్షదీప్‌సింగ్‌, అక్షర్‌ పటేల్‌ మంచి తోడ్పాటు అందించారు. మరి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ గెలుపు క్రెడిట్‌ను కోహ్లీ బుమ్రాకు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments