iDreamPost
android-app
ios-app

పేసర్ ఆకాశ్​దీప్​కు కోహ్లీ స్పెషల్ గిఫ్ట్! ఏం ఇచ్చాడంటే?

  • Published Sep 16, 2024 | 8:09 PM Updated Updated Sep 16, 2024 | 8:09 PM

Virat Kohli Special Gift To Akash Deep: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరితోనూ ఈజీగా కలసిపోతాడు. సీనియర్స్, జూనియర్స్ అనే తేడాల్లేకుండా అందరు ఆటగాళ్లతో ఒకేలా ఉంటాడు. టీమ్​లోకి కొత్తగా వచ్చే యంగ్​స్టర్స్​కు అండగా ఉంటాడు.

Virat Kohli Special Gift To Akash Deep: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరితోనూ ఈజీగా కలసిపోతాడు. సీనియర్స్, జూనియర్స్ అనే తేడాల్లేకుండా అందరు ఆటగాళ్లతో ఒకేలా ఉంటాడు. టీమ్​లోకి కొత్తగా వచ్చే యంగ్​స్టర్స్​కు అండగా ఉంటాడు.

  • Published Sep 16, 2024 | 8:09 PMUpdated Sep 16, 2024 | 8:09 PM
పేసర్ ఆకాశ్​దీప్​కు కోహ్లీ స్పెషల్ గిఫ్ట్! ఏం ఇచ్చాడంటే?

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం గురించి తెలిసిందే. గ్రౌండ్​లో ఎంత అగ్రెసివ్​గా ఉంటాడో బయట అంత కూల్​గా, కామ్​గా ఉంటాడు. నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తన చుట్టూ వాతావరణం పాజిటివ్​గా ఉండేలా చూసుకుంటాడు. డ్రెస్సింగ్ రూమ్​లోనూ ఇలాగే ఉంటాడు కింగ్. అందుకే అతడి చుట్టూ ఎక్కువగా జూనియర్ ప్లేయర్లు కనిపిస్తుంటారు. అందరితోనూ ఈజీగా కలసిపోతాడు కోహ్లీ. సీనియర్స్, జూనియర్స్ అనే తేడాల్లేకుండా అందరు ఆటగాళ్లతో ఒకేలా ఉంటాడు. టీమ్​లోకి కొత్తగా వచ్చే యంగ్​స్టర్స్​కు అండగా ఉంటాడు. వాళ్లకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూనే.. ఒక్కోసారి సర్​ప్రైజ్​ గిఫ్ట్​లు కూడా ప్రెజెంట్ చేస్తుంటాడు. తాజాగా యంగ్ పేసర్ ఆకాశ్​దీప్​కు కోహ్లీ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. విరాట్ ఏం ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..

కోహ్లీ తన మంచి మనసు చాటుకున్నాడు. జూనియర్లకు ఎప్పుడూ సపోర్ట్​గా ఉంటే విరాట్.. తాజాగా ఆకాశ్​దీప్​కు ఓ ప్రత్యేక బహుమతిని ఇచ్చి ఆశ్యర్యానికి గురిచేశాడు. తాను వాడే బ్యాట్​ను యంగ్ పేసర్​కు గిఫ్ట్​గా ఇచ్చాడు కింగ్. ఈ విషయాన్ని స్వయంగా ఆకాశ్​దీప్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్​తో తెలియజేశాడు. గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ భయ్యా అంటూ కోహ్లీని మెన్షన్ చేశాడు యంగ్ పేసర్. బ్యాట్ ఫొటోను అందరితో షేర్ చేసుకున్నాడు. ఇది చూసిన నెటిజన్స్.. కోహ్లీ జూనియర్లతో ఎలా ఉంటాడో చెప్పేందుకు ఇదో ఎగ్జాంపుల్ అని అంటున్నారు. యంగ్​స్టర్స్​ను ఇలా ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయమని ప్రశంసిస్తున్నారు. రోహిత్, కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్స్ నుంచి చిన్న వస్తువు వచ్చినా అది యువ ఆటగాళ్లలో నింపే స్ఫూర్తి, వాళ్లకు ఇచ్చే ఎనర్జీ మాటల్లో చెప్పలేనిదని చెబుతున్నారు నెటిజన్స్.

ఇక, బంగ్లాదేశ్​తో జరిగే టెస్ట్ సిరీస్​కు ఆకాశ్​దీప్ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్​లో ఈ పేసర్​కు కోహ్లీ బ్యాట్ బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్​తో ఇంటర్నేషనల్ క్రికెట్​లో డెబ్యూ ఇచ్చిన ఆకాశ్​దీప్.. ఆ సిరీస్​తో సత్తా చాటాడు. ఆ తర్వాత జరిగిన డొమెస్టిక్ టోర్నీల్లోనూ తన పేస్ పవర్ చూపించాడు. దులీప్ ట్రోఫీ-2024 ఫస్ట్ రౌండ్​లోనూ చెలరేగి బౌలింగ్ చేశాడు. ఇండియా-ఏ తరఫున బరిలోకి దిగిన అతడు.. ఇండియా-బీతో జరిగిన మ్యాచ్​లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్​లోనూ సత్తా చాటాడు. సెకండ్ ఇన్నింగ్స్​లో 42 పరుగులతో దుమ్మురేపాడు. అటు బౌలింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ రాణిస్తుండటంతో అతడికి ఎంకరేజ్​మెంట్​గా ఉంటుందని కోహ్లీ తన బ్యాట్​ను గిఫ్ట్​గా ఇచ్చాడని తెలుస్తోంది.