iDreamPost
android-app
ios-app

రోహిత్ శర్మ బయోపిక్​లో Jr NTR? ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేయలేదు!

  • Published Sep 16, 2024 | 7:48 PM Updated Updated Sep 16, 2024 | 7:48 PM

Jr NTR To Star As Rohit Sharma In Biopic: బయోపిక్స్ ట్రెండ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. పాపులర్ ఫిల్మ్, పొలిటికల్, స్పోర్ట్స్ సెలెబ్రిటీల జీవితాలపై తీసిన పలు బయోపిక్ చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించడమే గాక ఆడియెన్స్​ను కూడా మెప్పించాయి.

Jr NTR To Star As Rohit Sharma In Biopic: బయోపిక్స్ ట్రెండ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. పాపులర్ ఫిల్మ్, పొలిటికల్, స్పోర్ట్స్ సెలెబ్రిటీల జీవితాలపై తీసిన పలు బయోపిక్ చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించడమే గాక ఆడియెన్స్​ను కూడా మెప్పించాయి.

  • Published Sep 16, 2024 | 7:48 PMUpdated Sep 16, 2024 | 7:48 PM
రోహిత్ శర్మ బయోపిక్​లో Jr NTR? ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేయలేదు!

మూవీ ఇండస్ట్రీలో బయోపిక్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పాపులర్ ఫిల్మ్, పొలిటికల్, స్పోర్ట్స్ సెలెబ్రిటీల జీవితాలపై తీసిన పలు బయోపిక్ చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించడమే గాక ఆడియెన్స్​ను మెప్పించాయి. కమర్షియల్​గానూ వర్కౌట్ అవడమే గాక అవార్డుల పంట పండించాయి. దీంతో ఆ భాష, ఈ భాష అనే తేడా లేకుండా చాలా ఇండస్ట్రీల్లో ఈ తరహా సినిమాలు వరుసగా వచ్చాయి. క్రీడల పరంగా చూసుకుంటే ‘భాగ్ మిల్కా భాగ్’, ‘ఎంఎస్ ధోని: ది అన్​టోల్డ్ స్టోరీ’ లాంటి బయోపిక్స్ డబుల్ బ్లాక్​బస్టర్స్​గా నిలిచాయి. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ జీవితకథతో ఇప్పుడో బయోపిక్ రూపొందుతోంది. ఈ తరుణంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ​ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హిట్​మ్యాన్​ బయోపిక్​లో లీడ్ రోల్​లో మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడట. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

రోహిత్ శర్మ లైఫ్​ ఆధారంగా బయోపిక్ తీయాలని చాన్నాళ్లుగా అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్-2024ను భారత్ గెలుచుకున్నాక ఈ డిమాండ్లు మరింతగా ఊపందుకున్నాయి. ధోనీతో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ వచ్చేశాయని.. నెక్స్ట్ రోహిత్ జీవితం ఆధారంగా సినిమా తీస్తే బాగుంటుందని క్రికెట్ లవర్స్ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఈ మూవీలో రోహిత్​గా ఎవరు కనిపిస్తే బాగుంటుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. తాజాగా దీనికి సమాధానం దొరికేసినట్లే కనిపిస్తోంది. రోహిత్​గా తారక్ కనిపిస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. భారత సారథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే అదిరిపోతుందని.. స్క్రీన్స్ బ్లాస్ట్ అయిపోతాయని చెబుతున్నారు ఫ్యాన్స్.

రోహిత్ శర్మగా ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని అటు మూవీ ఫ్యాన్స్​తో పాటు ఇటు క్రికెట్ లవర్స్ కూడా కోరుకుంటున్నారు. ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయని.. చూడటానికి దాదాపుగా ఒకేలా ఉంటారని ఫ్యాన్స్ అంటున్నారు. ఏ పాత్రలోనైనా ఈజీగా పరకాయ ప్రవేశం చేసే తారక్.. హిట్​మ్యాన్​ రోల్​కు ఒప్పుకుంటే అంతకుమించిన సంచలనం మరొకటి లేదని చెబుతున్నారు. ఇది మరో గ్రేట్ బయోపిక్​గా నిలిచిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కార్యరూపం దాలిస్తే చూడాలని ఉందని అంటున్నారు. అయితే ఇది రోహిత్-ఎన్టీఆర్ చేతుల్లో ఉంది. వాళ్లు ఈ ఆలోచనతో ఉంటే సాధ్యమే లేదా ఎవరైనా మేకర్స్ ఈ దిశగా ప్లాన్ చేసి బయోపిక్​ను సెట్ చేస్తే సూపర్బ్​గా ఉంటుంది. కాగా, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ ఫిల్మ్ రిలీజ్​కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్​లో బహు భాషల్లో ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది. మరి.. రోహిత్ బయోపిక్​లో ఎన్టీఆర్ నటిస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.