iDreamPost

కోహ్లీ ఫ్యాన్స్​కు పనీపాటా లేదు.. వాళ్లు వేస్ట్: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్

  • Published Jun 03, 2024 | 5:14 PMUpdated Jun 03, 2024 | 5:14 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్​బేస్ గురించి తెలిసిందే. విరాట్ కోసం ఏం చేయడానికైనా అభిమానులు సిద్ధంగా ఉంటారు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్​బేస్ గురించి తెలిసిందే. విరాట్ కోసం ఏం చేయడానికైనా అభిమానులు సిద్ధంగా ఉంటారు.

  • Published Jun 03, 2024 | 5:14 PMUpdated Jun 03, 2024 | 5:14 PM
కోహ్లీ ఫ్యాన్స్​కు పనీపాటా లేదు.. వాళ్లు వేస్ట్: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్

విరాట్ కోహ్లీ.. క్రికెట్ అనే కాదు, స్పోర్ట్స్​లో హ్యూజ్ ఫ్యాన్​బేస్ ఉన్న అథ్లెట్లలో ఒకడు. క్రికెట్​ను చూసేవారే కాదు.. ఈ ఆటతో సంబంధం లేని వారికి కూడా కోహ్లీ అనే పేరు తెలుసు. జెంటిల్మన్ గేమ్​కు అతడు బ్రాండ్ అంబాసిడర్​గా మారిపోయాడు. దశాబ్దంన్నర కాలం నుంచి అద్భుతమైన బ్యాటింగ్​తో క్రికెట్​ క్రేజ్​ను విశ్వవ్యాప్తం చేశాడు. అతడి బ్యాటింగ్, స్టైల్, యాటిట్యూడ్​కు కోట్లాది మంది ఫ్యాన్స్ అయిపోయారు. మన దేశంలోనే గాక విదేశాల్లోనూ కింగ్​కు భారీ లెవల్​లో ఫాలోయింగ్ ఉంది. కోహ్లీని చూడాలని, అతడితో సెల్ఫీ దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కోరుకునే అభిమానులకు లెక్కే లేదు. అలాంటోళ్లు అతడ్ని ఒక మాట అంటే ఊరుకుంటారా? కోహ్లీని ఏమైనా అంటే వాళ్లను అతడి ఫ్యాన్స్ అస్సలు వదలరు.

కోహ్లీతో పెట్టుకుంటే అతడి అభిమానులతో పెట్టుకున్నట్లే. విరాట్​ను గెలికిన వారిని స్టేడియాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అతడి ఫ్యాన్స్ ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. విరాట్ అభిమానులకు పనీపాటా లేదని, వాళ్లు వేస్ట్ అని అన్నాడు. కోహ్లీ గురించి ఒక్క మాట అన్నా అతడి ఫ్యాన్స్ ఊరుకోరని.. సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారని కమిన్స్ తెలిపాడు. కొన్నేళ్ల కింద కోహ్లీని మెచ్చుకుంటూ ఓ కామెంట్ చేశానని, కానీ దాన్ని అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

2018లో నాలుగు టెస్టుల సిరీస్​ కోసం ఆస్ట్రేలియాకు పయనమైంది టీమిండియా. పెర్త్ ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్ట్​లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. అయినా భారత్ 146 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్​లో కోహ్లీ శతకం మార్క్​ను అందుకోలేడని, అతడ్ని ముందే ఆపుతామని కమిన్స్ చెప్పాడు. అతడు గ్రేట్ ప్లేయర్ అని మెచ్చుకున్నాడు. గొప్ప ఆటగాడు అంటూనే సెంచరీ కొట్టలేడంటూ ఎద్దేవా చేశాడు. కానీ ఆ మ్యాచ్​లో కింగ్​ను కంగారూలు ఆపలేకపోయారు. ఆ మ్యాచ్​లో ఓడినా.. విరాట్ కెప్టెన్సీలోని టీమిండియా పుంజుకొని సిరీస్​ను సొంతం చేసుకుంది. దీంతో అప్పట్లో కమిన్స్​పై ఫ్యాన్స్ విమర్శలకు దిగారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ తాజాగా పైకామెంట్స్ చేశాడు కమిన్స్. అయితే కోహ్లీ ఫ్యాన్స్​కు​ పనీపాటా లేదని అతడు అనలేదని, చిన్న క్లిప్​కు ఆ క్యాప్షన్ పెట్టి కావాలనే వైరల్ చేస్తున్నారని ఆసీస్ అభిమానులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి