Nidhan
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. వరల్డ్ కప్ డ్రీమ్ నిజమవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. వరల్డ్ కప్ డ్రీమ్ నిజమవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. వరల్డ్ కప్ డ్రీమ్ నిజమవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన విరాట్.. టీమ్ మెంబర్స్ అందరితో సహా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడు. ఆ భేటీ తర్వాత ముంబైకి వచ్చి విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నాడు. అభిమానులతో కలసి వరల్డ్ కప్ విక్టరీని ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. వాంఖడే మైదానంలో దేశ భక్తి గీతాలకు డ్యాన్సులు వేస్తూ, పాటలు పాడుతూ అందర్నీ అలరించాడు. విక్టరీ పరేడ్ ముగిసిన తర్వాత లండన్ ఫ్లైట్ ఎక్కేశాడు కోహ్లీ. భార్య అనుష్క సహా ఇద్దరు పిల్లలు అక్కడే ఉండటంతో లండన్‌కు వెళ్లిపోయాడు కింగ్.
శ్రీలంకతో ఈ నెలాఖరులో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే రెస్ట్ కోరుకుంటే అతడి స్థానంలో ఇంకొకర్ని రీప్లేస్ చేయొచ్చు. కానీ ఈ సిరీస్ ముగిశాక నెలన్నర రోజుల వరకు ఇంకో సిరీస్ లేదు కాబట్టి కోహ్లీ సహా ఇతర సీనియర్లు ఆడాల్సిందేనని కొత్త కోచ్ గంభీర్ పట్టుబడుతున్నాడట. దీంతో విరాట్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కోహ్లీ గురించి మాజీ భారత బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ ఈ స్థాయికి ఎదుగుతాడని అస్సలు ఊహించలేదన్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నానని.. అతడికి గేమ్‌లో ఎన్నో కోరికలు ఉండేవన్నాడు. కష్టమైన లక్ష్యాలను సాధిస్తానంటూ విరాట్ చెబుతుంటే ఇతడికి ఏమైనా పిచ్చా అని అనుకునేవాడ్నని ఊతప్ప తెలిపాడు.
‘ఢిల్లీ వీధుల్లో తిరిగే కుర్రాడిలా ఉన్నప్పటి నుంచి కోహ్లీ ఏంటో నాకు తెలుసు. అతడ్ని దగ్గర నుంచి గమనిస్తూ వచ్చా. అతడు సాదాసీదా స్థాయి నుంచి ఈ రేంజ్‌కు ఎదుగుతాడని ఎవరమూ ఊహించలేదు. 15 ఏళ్ల కింద తన టార్గెట్స్ ఇవి అంటూ ఏమైతే చెప్పాడో అవే ఇప్పుడు విరాట్ సాధించి చూపిస్తున్నాడు. అతడికి తన మీద తనకు ఉన్న నమ్మకం అద్భుతమనే చెప్పాలి. 19 ఏళ్ల వయసులో కోహ్లీ ఏదేదో సాధిస్తానంటూ చెప్పేవాడు. అతడి మాటలు వింటే పిచ్చా అనిపించేది. కానీ పదేళ్లు గడిచే సరికి బెస్ట్ క్రికెటర్‌గా మారాడు. ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ వస్తున్నాడు. తన మీద తనకు ఉన్న కాన్ఫిడెన్సే అతడ్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీ కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు ఈ స్థాయికి చేరుకుంటాడని మీరు ఊహించారా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Robin Uthappa talking about on Virat Kohli and his tremendous evolution and his mindset. 🙌
– King Kohli, The GOAT. 🐐 pic.twitter.com/2qvs59GIFf
— Tanuj Singh (@ImTanujSingh) July 17, 2024