Somesekhar
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఓ క్రేజీ రికార్డ్ ను సమం చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు కింగ్ కోహ్లీ. ఆ వివరాల్లోకి వెళితే..
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఓ క్రేజీ రికార్డ్ ను సమం చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు కింగ్ కోహ్లీ. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. టీమ్ లో ఏ ఒక్క ప్లేయర్ నుంచి సహకారం అందకపోయినప్పటికీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. దాదాపు ప్రతీ మ్యాచ్ లో పరుగులు చేస్తూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా ఆదివారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఓ క్రేజీ రికార్డ్ ను నెలకొల్పాడు. ఈ ఘతన సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు విరాట్ భాయ్. తద్వారా ఆ డాషింగ్ ప్లేయర్ రికార్డు ను సమం చేశాడు. ఇంతకీ ఆ ఘతన ఏంటంటే?
గుజరాత్ టైటాన్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 70 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. టీమ్ కు విజయాన్ని అందించాడు. ఇక ఈ ఐపీఎల్ లో పరుగులు వరదపారిస్తున్న ఈ రన్ మెషిన్ ఓ క్రేజీ రికార్డ్ ను సమం చేశాడు. అదేంటంటే? ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు విరాట్. దీంతో 17 ఐపీఎల్ సీజన్ల చరిత్రలో 7 సార్లు ఈ ఘతన సాధించిన ప్లేయర్ గా ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రికార్డ్ ను సమం చేశాడు.
కాగా.. వార్నర్ కూడా ఐపీఎల్ చరిత్రలో 500 పరుగులను 7 సార్లు సాధించాడు. తాజాగా ఆ ఘనతను ఈక్వల్ చేశాడు కోహ్లీ. ఇక ఈ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా కూడా విరాట్ నిలిచాడు. అయితే దాదాపు ప్రతి సీజన్ లో పరుగుల వరదపారిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆర్సీబీకి మాత్రం కప్ అందించడంలో సఫలం కాలేకపోతున్నాడు. టీమ్ లో ఒక్కడే రాణిస్తుండం, అతడికి ఇతర ప్లేయర్ల నుంచి సహకారం లభించకపోవడంతో.. విరాట్ అద్భుత ఇన్నింగ్స్ లు వృథాగా పోతున్నాయి. మరి ఈ అరుదైన రికార్డ్ విరాట్ సాధించడంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
Most 500 runs in an IPL season:
Virat Kohli – 7*
David Warner – 7 pic.twitter.com/zwBoCbQ4Ip
— Johns. (@CricCrazyJohns) April 28, 2024