SNP
Virat Kohli, Rohit Sharma, IND vs AFG, T20 World Cup 2024: విరాట్ కోహ్లీ లాంటి బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో ఒక సింపుల్ క్యాచ్‌ను వదిలేశాడు. దానికి రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. ఆ విషయం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Virat Kohli, Rohit Sharma, IND vs AFG, T20 World Cup 2024: విరాట్ కోహ్లీ లాంటి బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో ఒక సింపుల్ క్యాచ్‌ను వదిలేశాడు. దానికి రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. ఆ విషయం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే చాలా మంది విరాట్ కోహ్లీ పేరు చెబుతారు. కానీ, అదే కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లో ఒక సింపుల్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గురువారం భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సూపర్ 8 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ లాంటి బెస్ట్ ఫీల్డర్ క్యాచ్ వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బ్యాటింగ్‌లో రన్స్ చేయలేక కాస్త ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఇలా ఫీల్డింగ్‌లోనూ చెత్త ప్రదర్శన కనబరుస్తుండటం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా క్యాచ్ డ్రాప్ అయినప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇచ్చిన రియాక్షన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ నాలుగో బంతికి.. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా మంచి షాట్ ఆడాడు. అయితే.. అది నేరుగా కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్స్‌లో ఒకడైన కోహ్లీ చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి.. అంతా వికెట్ పడింది అనుకున్నారు. కానీ, ఎంత వేగంగా కోహ్లీ చేతుల్లోకి దూసుకెళ్లిందో.. అంతే వేగంగా చేతులకి తగిలి కిందపడింది. కోహ్లీ నుంచి ఒక క్యాచ్ డ్రాప్ అయింది. అప్పటికే ఒక వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఆఫ్ఘాన్‌కు మరో షాక్ ఇవ్వడంలో కోహ్లీ విఫలం అయ్యాడు. కోహ్లీ క్యాచ్ వదిలిపెట్టడాన్ని నమ్మలేకపోయిన రోహిత్ శర్మ.. రెండు చేతులు తలపై పెట్టుకుని.. ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కోహ్లీ క్యాచ్ వదిలిన వీడియోతో పాటు రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమైనా.. కోహ్లీ 24 పరుగులతో కాస్త టచ్‌లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే హార్ధిక్ పాండ్యా కూడా 32 పరుగులతో రాణించాడు. చివర్లో ఓవర్లో అక్షర్ పటేల్ 12 పరుగులు చేసి మంచి స్కోర్ అందించాడు. ఇక 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ క్యాచ్ వదిలేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Reaction of Captain Rohit Sharma when a dolly was dropped by Virat Kohli. pic.twitter.com/YuNDJbXR5G
— Vishal. (@SPORTYVISHAL) June 20, 2024