Nidhan
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. ఆ విషయంలో విరాట్ డామినేషన్ ముందు షారుక్ నిలవలేకపోయాడు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. ఆ విషయంలో విరాట్ డామినేషన్ ముందు షారుక్ నిలవలేకపోయాడు.
Nidhan
మొదటి టెస్ట్‌లో సౌతాఫ్రికా చేతిలో చావుదెబ్బ తిన్న టీమిండియా రెండో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఈసారి ఎలాగైనా ఆతిథ్య జట్టును చిత్తు చేయాలని వ్యూహాలు పన్నుతోంది. పేస్, బౌన్స్‌కు సహకరించే పిచ్‌ల మీద ప్రొటీస్ బౌలర్లను మరింత కాన్ఫిడెంట్‌గా ఎదుర్కోవాలని చూస్తోంది. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు భారత ప్లేయర్లు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జోరుగా బ్యాటింగ్ సాధన చేస్తున్నారు. వెన్ను నొప్పి వల్ల తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయిన రవీంద్ర జడేజా కూడా ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా కొమ్ములు వంచాలని చూస్తున్నాడు. ఫస్ట్ టెస్ట్‌లో ఆఖరి వరకు పోరాటం చేసిన కోహ్లీ అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో కింగ్ కోహ్లీకి అభిమానులకు మరింత జోష్‌ను ఇచ్చే ఒక న్యూస్. ఓ విషయంలో బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్‌ను విరాట్ దాటేశాడు.
హ్యూజ్ ఫ్యాన్‌బేస్ కలిగిన విరాట్ కోహ్లీ ఈసారి షారుక్ ఖాన్‌కు షాకిచ్చాడు. 2023లో అత్యధిక వికీపీడియా పేజెస్ వ్యూస్ కలిగిన ఆసియా సెలబ్రిటీగా కోహ్లీ నిలిచాడు. ఎక్కువ మంది చూసిన వికీపీడియా పేజ్ విరాట్‌దే. అతడి వికీపీడియా పేజ్‌ను ఏకంగా 10.7 మిలియన్ల మంది చూశారు. కింగ్ తర్వాతి స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుక్ నిలిచాడు. ఈ హిందీ స్టార్ వికీపీడియా పేజీకి 7.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మోస్ట్ వ్యూడ్ వికీపీడియా పేజెస్ లిస్ట్‌లో మూడో పొజిషన్లో ఉన్నారు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (6.5 మిలియన్లు). బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు చాలా మందిని వెనక్కి నెట్టి మరీ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచాడు కోహ్లీ. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచిన కింగ్.. మిగిలిన టోర్నమెంట్లలోనూ తన బ్యాట్‌తో దుమ్మురేపాడు. దీంతో సోషల్ మీడియా, ఇంటర్నెట్లో అతడే హాట్ టాపిక్ అయ్యాడు.
2023 ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ఇయర్ అవార్డునూ కోహ్లీ సొంతం చేసుకోవడం విశేషం. వరల్డ్‌వైడ్‌గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆటగాళ్లు ఈ పురస్కారం కోసం పోటీపడ్డారు. అందులో పదహారు మంది నాకౌట్ రౌండ్‌కు సెలక్ట్ అవగా.. మెయిన్ కాంపిటీషన్ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి కోహ్లీకి మధ్యే జరిగింది. అయితే ఫైనల్ ఓటింగ్‌లో మెస్సీకి 22 శాతం ఓట్లు రాగా.. విరాట్‌కు ఏకంగా 78 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. దీన్ని బట్టే టీమిండియా సీనియర్ బ్యాటర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు గతేడాది మరికొన్ని ఘనతలు అందుకున్నాడు కోహ్లీ. ఇంటర్నెట్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఆసియా ఖండపు వ్యక్తిగా నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు కోహ్లీ. దీంతో 2023 మొత్తం విరాట్ డామినేషన్ నడిచిందని.. కొత్త ఏడాదీ కింగ్ రూల్ చేస్తాడని అతడి అభిమానులు అంటున్నారు. మరి.. కింగ్ ఖాన్ షారుక్‌ను కోహ్లీ దాటేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: నా కష్టాలు ఇంకెవరికీ రాకూడదు. అందుకే రాజకీయాల్లోకి..: అంబటి రాయుడు
Most viewed Wikipedia pages of Asians in 2023:
1) Virat Kohli – 10.7 Million.
2) Shahrukh Khan – 7.7 Million.
3) Priyanka Chopra – 6.5 Million.King continues his dominance 🐐👑 pic.twitter.com/cHLfzgHwdp
— Johns. (@CricCrazyJohns) January 1, 2024