విరాట్ కోహ్లీ.. రన్ మెషిన్, ఛేజ్ మాస్టర్.. ఫిట్ నెస్ కా బాప్.. రికార్డుల రారాజు.. ఇలా రకరకాల పేర్లతో ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. అతడు మైదానంలోకి దిగాడు అంటే రికార్డులు బద్దలవడం ఖాయమే. తాజాగా ఆసియా కప్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. తద్వారా టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజం అజహరుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు కింగ్ కోహ్లీ. మరి కోహ్లీ సాధించిన రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆసియా కప్-2023లో భాగంగా తాజాగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ షేక్ క్యాచ్ పట్టడం ద్వారా ఈ రికార్డును క్రియేట్ చేశాడు. ఆసిఫ్ క్యాచ్ పట్టడంతో మల్టీ నేషనల్ వన్డే టోర్నమెంట్స్ లో 100 క్యాచ్ లను పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజం మహ్మద్ అజహరుద్దీన్ తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో నాన్ వికెట్ కీపర్ గా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే అంతకు ముందు ఆసిఫ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను వదిలేసిన విరాట్.. తర్వాత అద్భుతమైన క్యాచ్ పట్టి అతడిని పెవిలియన్ కు పంపాడు. దీంతో రికార్డుల రారాజు కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 48.1 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ టార్గెట్ ను 23 ఓవర్లలో 145 పరుగులకు నిర్దేశించారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా వికెట్ నష్టపోకుండా టార్గెట్ ను ఛేదించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(74), శుభ్ మన్ గిల్ (67) పరుగులు చేసి అజేయంగా విజయం అందించారు. మరి రికార్డుల రారాజు ఖాతాలోకి మరో రికార్డు చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Most catches in ODIs
Mahela Jayawardene – 218
Ricky Ponting – 160
Mohammad Azharuddin – 156
Virat Kohli – 143*
Ross Taylor – 142#ViratKohli #INDvNEP pic.twitter.com/hCyr5Y39zb— Sportskeeda (@Sportskeeda) September 4, 2023