iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీతో 8 ఏళ్ల బంధానికి ​ఎండ్‌ కార్డ్‌! కాంట్రాక్ట్‌ ముగిసింది!

  • Published Feb 08, 2024 | 11:43 AM Updated Updated Feb 08, 2024 | 11:43 AM

విరాట్‌ కోహ్లీ.. పరిచయం అక్కర్లేని పేరు. ఆ పేరే ఒక బ్రాండ్‌. అలాంటి ఆటగాడు ఆటగాడిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలే క్యూ కడతాయి. కానీ, తాజాగా కోహ్లీతో..

విరాట్‌ కోహ్లీ.. పరిచయం అక్కర్లేని పేరు. ఆ పేరే ఒక బ్రాండ్‌. అలాంటి ఆటగాడు ఆటగాడిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలే క్యూ కడతాయి. కానీ, తాజాగా కోహ్లీతో..

  • Published Feb 08, 2024 | 11:43 AMUpdated Feb 08, 2024 | 11:43 AM
Virat Kohli: కోహ్లీతో 8 ఏళ్ల బంధానికి ​ఎండ్‌ కార్డ్‌! కాంట్రాక్ట్‌ ముగిసింది!

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రీఎంట్రీ కోసం క్రికెట్‌ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అదరగొట్టిన కోహ్లీ.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌తో గ్రౌండ్‌లో దిగాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉన్నా.. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరం అయ్యాడు. మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉంటాడా? లేడా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే.. కోహ్లీ తిరిగి టీమ్‌లోకి రావాలని భారత క్రికెట్‌ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం తెలుస్తోంది. అదేంటంటే..

కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌గా, ఫేస్‌ ఆఫ్‌ వరల్డ్‌ క్రికెట్‌గా కోహ్లీ ఉన్నాడు. అలాంటి పాపులారిటీ ఉన్న క్రికెటర్‌ను తమ ప్రొడెక్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతుంటాయి. చాలా కాలంగా కోహ్లీ.. పాపులర్‌ బ్రాండ్‌ పుమాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. దాదాపు 8 ఏళ్ల క్రితం కోహ్లీని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పుమా నియమించుకుంది. అందుకోసం.. కోహ్లీ ఏకంగా రూ.110 కోట్లు చెల్లించింది. ఇంత భారీ మొత్తంలో ముట్టజెప్పి మరీ కోహ్లని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుందంటే.. కోహ్లీకి ఉన్న క్రేజ్‌, డిమాండ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అయితే.. ఇప్పుడీ 8 ఏళ్ల బంధానికి ఎండ్‌ కార్డ్‌ పడనుంది. కోహ్లీ-పుమా మధ్య​ కాంట్రాక్ట్‌ పూర్తి కావడంతో.. ఇకపై కోహ్లీ పుమాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగడు. పుమాకు బైబై చెప్పిన కోహ్లీ.. ఇక నుంచి మరో ప్రముఖ బ్రాండ్‌ అగిలిటాస్ స్పోర్ట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకోసం కోహ్లీకి డబ్బు కాకుండా.. ఆ కంపెనీలో ఈక్విటీ షేర్లను తీసుకోనున్నాడు. అంటే.. కంపెనీలో కోహ్లీకి కూడా వాటా ఉంటుంది. అయితే.. కోహ్లీతో పాటు అతని భార్య, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా పుమాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది. మరి ఆమె కాంట్రాక్ట్‌ కూడా ముగిసిందా? లేదా అన్న విషయం తెలియరాలేదు. మరి పుమాతో 8 ఏళ్ల బంధానికి పుల్‌స్టాప్‌ పెట్టి.. అగిలిటాస్‌ స్పోర్ట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోహ్లీ మారుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.