iDreamPost
android-app
ios-app

అప్పుడు బ్రాడ్.. ఇప్పుడు కోహ్లీ..  బెయిల్స్ కి మంత్రం వేసి అవుట్!

Virat Kohli Magic In Centurion Test: సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తడబడుతోంది. అయితే విరాట్ కోహ్లీ చేసిన మ్యాజిక్ తో ప్రొటీస్ జట్టు వికెట్లు కోల్పోయింది.

Virat Kohli Magic In Centurion Test: సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తడబడుతోంది. అయితే విరాట్ కోహ్లీ చేసిన మ్యాజిక్ తో ప్రొటీస్ జట్టు వికెట్లు కోల్పోయింది.

అప్పుడు బ్రాడ్.. ఇప్పుడు కోహ్లీ..  బెయిల్స్ కి మంత్రం వేసి అవుట్!

టీమిండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికాలో భాగంగా ఇండియా- సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కాస్త తడబడుతూ కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ పరంగా టీమిండియా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే అద్భుతమైన శతకంతో రాణించాడు. మొత్తానికి తొలి ఇన్నింగ్స్ లో భారత్ 245 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా భారత బౌలర్లను ఆడేసుకుంటోంది. 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ప్రొటీస్ జట్టు.. ఆ తర్వాత వంద పరుగుల వరకు వికెట్ కోల్పోలేదు. ఈ తురణంలోనే కోహ్లీ మ్యాజిక్ చేశాడు.

సౌత్ ఆఫ్రికా జట్టు తొలి వికెట్ కోల్పోయిన తర్వాత అస్సలు కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించలేదు. 11 పరుగుల వద్ద సిరాజ్ కు అయిడెన్ మార్కరమ్ వికెట్ దక్కింది. ఆ తర్వాత మళ్లీ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు అవకాశం ఇవ్వలేదు. స్కోరు బోర్డు పరుగులు పెడుతూ ఉంది. టోనీ డీ జోర్జీతో కలిసి డీన్ ఎల్గర్ క్రీజులో పాతుకుపోయాడు. సిరాజ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ఎవరికీ అవకాశం లేకుండా చేస్తున్నారు. టోనీ డిఫెండ్ చేస్తుండగా.. ఎల్గర్ మాత్రం పరుగులు రాబడుతూ వచ్చాడు. ఆ సమయంలో కింగ్ కోహ్లీ ఒక మ్యాజిక్ చేశాడు. వెళ్లి స్టంప్స్ మీదున్న బెయిల్స్ ని కదిలించాడు. వాటి స్థానాన్ని మార్చేశాడు. కోహ్లీ అలా చేసిన సరిగ్గా రెండు బంతులకే సౌత్ ఆఫ్రికా పార్టనర్ షిప్ బ్రేక్ అయ్యింది. బుమ్రా బౌలింగ్ లో టోనీ డీ జోర్జీ థర్డ్ స్లిప్ లో ఉన్న యశస్వీ జైస్వాల్ కు చిక్కాడు. అలా టోనీ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు.

అప్పటి వరకు వికెట్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియా బౌలర్లకు కోహ్లీ చేసిన మ్యాజిక్ వర్కౌట్ అయినట్లు కనిపించింది. గతంలో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఇలాంటి ఒక పని చేశాడు. ఇప్పుడు కోహ్లీ కూడా అలాంటి ఒక పని చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. మరోసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. అంతేకాకుండా మరో 4 ఓవర్లలో ప్రొటీస్ జట్టు తమ మూడో వికెట్ కూడా కోల్పోయింది. ఒక్క ఎల్గర్(82) మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. అతను శతకం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు.. 3 వికెట్ల నష్టానికి 138 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా బౌలింగ్ చూస్తే.. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. మరి.. కోహ్లీ చేసిన మ్యాజిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి