iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ! సచిన్‌కి సాధ్యం కాని రికార్డ్‌..

  • Author Soma Sekhar Published - 08:26 PM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Published - 08:26 PM, Mon - 11 September 23
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ! సచిన్‌కి సాధ్యం కాని రికార్డ్‌..

విరాట్ కోహ్లీ.. వరల్డ్ క్రికెట్ లో రికార్డులకు ఈ పేరు పర్యాయపదం. విరాట్ ఒక్క సెంచరీ కొడితే.. పదుల సంఖ్యలో రికార్డులు బద్దలవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 47వ సెంచరీతో చెలరేగాడు. అతడికి తోడు కేఎల్ రాహుల్ సైతం రీ ఎంట్రీతో శతకం చేశాడు. దీంతో 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది టీమిండియా. ఈ క్రమంలోనే కింగ్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అందులో సచిన్ ఆల్ టైమ్ రికార్డు కూడా బద్దలైంది.

విరాట్ కోహ్లీకి రికార్డుల రారాజుగా పేరున్న సంగతి అందరికి తెలిసిందే. అతడు ఒక్క సెంచరీ కొడితే.. పదుల సంఖ్యలో రికార్డులు బ్రేక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు విరాట్. ఈ సెంచరీతో అంతర్జాతీయ వన్డేల్లో 47వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు కింగ్ కోహ్లీ. ఈ క్రమంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. దీంతో ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఈ క్రమంలోనే అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 13 వేల పరుగులు పూర్తిచేసుకున్న తొలి ప్లేయర్ గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఈ రికార్డు ఇంతకు ముందు సచిన్ పేరిట ఉండేది. సచిన్ కు 13 వేల పరుగులు పూర్తి చేయడానికి 321 ఇన్నింగ్స్ లు పడితే.. విరాట్ కోహ్లీకి కేవలం 267 ఇన్నింగ్స్ లు మాత్రమే అవసరం అయ్యాయి. ఈ లిస్ట్ లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(341). ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర(363), జయసూర్య(416) ఉన్నారు. మరి రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. దూసుకెళ్తున్న విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.