iDreamPost
android-app
ios-app

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డు బ్రేక్‌ చేసిన విరాట్‌!

  • Published Oct 12, 2023 | 10:04 AM Updated Updated Oct 12, 2023 | 10:04 AM
  • Published Oct 12, 2023 | 10:04 AMUpdated Oct 12, 2023 | 10:04 AM
క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డు బ్రేక్‌ చేసిన విరాట్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో పసికూన ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఈజీ విక్టరీ సాధించింది. బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లతో సత్తా చాటాగా.. బ్యాటింగ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శివాలెత్తాడు. ఆఫ్ఘాన్‌ బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ.. ఏకంగా 131 పరుగులతో దుమ్మురేపాడు. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ సైతం 47 రన్స్‌తో పర్వాలేదనిపించాడు. అలాగే స్టార్‌ బ్యాటర్‌, ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ సైతం హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు. 55 పరుగులతో నాటౌట్‌గా నిలిస్తూ.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే.. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఓ అద్భుతమైన రికార్డును బ్రేక్‌ చేశాడు. అది కూడా క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ రికార్డు.

ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 67 మ్యాచ్‌లు ఆడి 2311 పరుగులు చేసి, సచిన్ టెండూల్కర్ 61 మ్యాచ్‌ల్లో 2278 పరుగుల రికార్డును బ్రేక్‌ చేశాడు. సచిన్‌ వరల్డ్‌ కప్పుల్లో 2278 రన్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని కోహ్లీ ఆక్రమించుకున్నాడు. సచిన్‌ తర్వాత స్థానంలో శ్రీలంక దిగ్గజ మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర 2193 రన్స్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఐసీసీ టోర్నీల్లో బెస్ట్ యావరేజ్ కలిగిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. వన్డే వరల్డ్‌ కప్స్‌లో 50.86 యావరేజ్‌తో రన్స్‌ చేసిన కోహ్లీ.. టీ20 వరల్డ్‌ కప్పుల్లో 81.50 యావరేజ్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీల్లో 88.16 సగటుతో రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్ల ఐసీసీ టోర్నీలో 50+ యావరేజ్ ఉన్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీనే.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగుల మంచి స్కోర్ చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అయితే ఢిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ కావడంతో 272 పెద్ద స్కోర్‌ కాదనుకోండి. అయినా కూడా ఆఫ్ఘాన్‌ లాంటి జట్టు టీమిండియా లాంటి పటిష్టమైన బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొని అంత స్కోర్‌ చేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే. భారత బౌలర్లలో బుమ్రా 4, పాండ్యా 2 వికెట్లతో రాణించారు. శార్ధుల్‌, కుల్దీప్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. అయితే… ఆఫ్ఘాన్‌ నిర్దేశించిన టార్గెట్‌ను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ ఊదిపారేశాడు. కేవలం 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులతో అదరగొట్టాడు. కోహ్లీ 56 బంతుల్లో 6 ఫోర్లతో 55 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు. మిగతా బౌలర్లు కేవలం పరుగులు సమర్పించుకోవడానికి మాత్రమే బౌలింగ్‌ వేశాడు. మరి ఈ మ్యాచ్‌లో క్రికెట్‌ దేవుడు సచిన్ రికార్డు బ్రేక్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కమ్​బ్యాక్​లో రెచ్చిపోతున్న KL రాహుల్​.. అతడి​ సక్సెస్​కు కారణం అదే!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet