iDreamPost
android-app
ios-app

కోహ్లీ అరుదైన ఘనత.. పాంటింగ్ రికార్డు బ్రేక్!

  • Author Soma Sekhar Published - 03:07 PM, Thu - 28 September 23
  • Author Soma Sekhar Published - 03:07 PM, Thu - 28 September 23
కోహ్లీ అరుదైన ఘనత.. పాంటింగ్ రికార్డు బ్రేక్!

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 2-1తో గెలుచుకుంది. చివరి మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేద్దామనుకున్న భారత్ కు భంగపాటు తప్పలేదు. ఇక ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ అర్దశతకంతో రాణించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 61 బంతులు ఎదుర్కొన్న విరాట్ 5 ఫోర్లు, ఓ సిక్స్ తో 56 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ భాయ్. ఈ రికార్డుతో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ను అధిగమించాడు. ఆ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా.. విరాట్ అర్దశతకం సాధించడం ద్వారా ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించిన మూడో ఆటగాడిగా కింగ్ విరాట్ నిలిచాడు. ఇప్పటి వరకు 269 ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్.. 113 సార్లు యాబైకి పైగా స్కోర్లు సాధించాడు. కాగా.. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ పేరిట ఉండేది. అతడు 112 సార్లు యాబైకి పైగా స్కోర్లు సాధించాడు. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. సచిన్ 145 సార్లు యాబైకి పైగా స్కోర్లు సాధించాడు. ఆ తర్వాత లంక దిగ్గజం కుమార సంగక్కర(118)తో రెండో స్థానంలో ఉన్నాడు. మరి అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.