Somesekhar
Virat Kohli bow down to Ravichandran Ashwin: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో అశ్విన్ గేమ్ కు ఫిదా అయిన టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ చేసిన చర్య ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Virat Kohli bow down to Ravichandran Ashwin: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో అశ్విన్ గేమ్ కు ఫిదా అయిన టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ చేసిన చర్య ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Somesekhar
బంగ్లాదేశ్ తో చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 515 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాను తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్ తో చెలరేగి సెంచరీ చేసిన ఈ వెటరన్ ప్లేయర్.. రెండో ఇన్నింగ్స్ లో బంతితో అదరగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన అశ్విన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. అశ్విన్ గేమ్ కు ఫిదా అయిన టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ చేసిన చర్య ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
రవిచంద్రన్ అశ్విన్.. బంగ్లాదేశ్ పై భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి సూపర్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో తన స్పిన్ మ్యాజిక్ తో బంగ్లా ఇన్నింగ్స్ ను కుప్పకూల్చాడు. 6 వికెట్లతో చెలరేగి ఇండియాకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ లో 37వ సారి 5 వికెట్ల హాల్ ను సాధించాడు అశ్విన్. వరల్డ్ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. వీరి కంటే ముందు 67 సార్లు 5 వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో ముత్తయ్య మురళీధరన్ కొనసాగుతున్నాడు. ఇక ఈ విన్నింగ్ స్పెల్ తో అదరగొట్టిన అశ్విన్ ఆటకు ఫిదా అయిన విరాట్ కోహ్లీ.. తన రెండు చేతులు పైకి ఎత్తి టేక్ ఏ బౌ అంటూ అభినందించాడు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్ ఇలా చేయడంతో ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక తొలి టెస్ట్ లో అదరగొట్టిన అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేయగా.. బంగ్లా 149 రన్స్ కే కుప్పకూలింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ను 287/4 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది భారత జట్టు. దాంతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. ఇక ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. ఏ దశలోనూ టార్గెట్ వైపు సాగలేదు. టీమిండియా బౌలర్లు వారిని కట్టడి చేశారు. దాంతో 234 రన్స్ కే ఆలౌట్ అయ్యి.. 280 పరుగుల తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ షాంటో 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. మరి అశ్విన్ ఆటకు ఫిదా అయ్యి.. విరాట్ టేక్ ఏ బౌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.