iDreamPost
android-app
ios-app

వీడియో: పంత్ ఔట్ అవుతాడని రెడీగా ఉన్న రాహుల్.. సిరాజ్ నవ్వులు..

  • Published Sep 22, 2024 | 6:26 PM Updated Updated Sep 22, 2024 | 6:26 PM

Rishabh pant: భారత్ బంగ్లా మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చోటు చేసుకున్న ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింటా వైరల్ గా మారింది.

Rishabh pant: భారత్ బంగ్లా మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చోటు చేసుకున్న ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింటా వైరల్ గా మారింది.

  • Published Sep 22, 2024 | 6:26 PMUpdated Sep 22, 2024 | 6:26 PM
వీడియో: పంత్ ఔట్ అవుతాడని రెడీగా ఉన్న రాహుల్.. సిరాజ్ నవ్వులు..

భారత్ -బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ నెల 19 నుంచి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. బంగ్లాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ విజయ దుందుభి మోగించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను నాలుగు వికెట్ల నష్టపోయి 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. బ్యాటింగ్ లో తడబడిన బంగ్లా చేతులెత్తేసింది. దీంతో 280 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారీ షాట్ ఆడాడు. గాల్లోకి లేసిన బాల్ ను శాంటో క్యాచ్ పడతాడనుకున్నారు. కానీ అది కాస్త మిస్ అయి పంత్ కు లైఫ్ దొరికింది. ఇక ఎలాగు పంత్ ఔటవుతాడని భావించిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు సిద్ధమయ్యాడు. కానీ, ఆ క్యాచ్ మిస్ కావడంతో తిరిగి చైర్ లో కూర్చున్నాడు. దీంతో పక్కనే ఉన్న సిరాజ్ నవ్వులు కురిపించాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

సెంచరీకి ముందు పంత్ రెండో ఇన్నింగ్స్ 49వ ఓవర్ లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బాల్ గాల్లోకి దూసుకెళ్లింది. శాంటో దానిని క్యాచ్ అందుకుంటాడని అందరూ భావించారు. వెంటనే మిస్టర్ కూల్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు రెడీ అయిపోయాడు. కుర్చీలోంచి లేచి గ్రౌండ్ లోకి వెళ్లపోయాడు. కానీ శాంటో క్యాచ్ మిస్ చేయడంతో రాహుల్ నవ్వుతూ తిరిగి సీట్ లో కూర్చున్నాడు. ఇది గమనించిన పక్కనే ఉన్న సిరాజ్ నవ్వులు పూయించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో పంత్ సూపర్బ్ ఇన్నింగ్స్​తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 128 బంతుల్లో 109 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బౌండరీలు, 4 భారీ సిక్సులు బాది బంగ్లాదేశ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.

 

View this post on Instagram

 

A post shared by 𝄟⃝Sᴜɴɴʏ ᴋᴜᴍᴀʀ🦅 (@itz_sunny_axx)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio