iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీ కొట్టిన ఆ ఒక్క ఫోర్‌ సౌతాఫ్రికాకు వరల్డ్‌ కప్‌ దూరం చేసింది! వాళ్ల దరిద్రానికి ఇదే నిదర్శనం!

  • Published Jul 09, 2024 | 8:18 AM Updated Updated Jul 09, 2024 | 8:18 AM

Virat Kohli, Suryakumar Yadav, IND vs SA, Final: సూర్య కుమార్‌ యాదవ్‌ చివరి ఓవర్‌లో పట్టిక క్యాచ్‌ టీమిండియా వరల్డ్‌ కప్‌ అందించిందంటారు.. కానీ, ఆ క్యాచ్‌ పట్టేందుకు కోహ్లీ కొట్టిన ఫోర్‌ కారణం.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Virat Kohli, Suryakumar Yadav, IND vs SA, Final: సూర్య కుమార్‌ యాదవ్‌ చివరి ఓవర్‌లో పట్టిక క్యాచ్‌ టీమిండియా వరల్డ్‌ కప్‌ అందించిందంటారు.. కానీ, ఆ క్యాచ్‌ పట్టేందుకు కోహ్లీ కొట్టిన ఫోర్‌ కారణం.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jul 09, 2024 | 8:18 AMUpdated Jul 09, 2024 | 8:18 AM
వీడియో: కోహ్లీ కొట్టిన ఆ ఒక్క ఫోర్‌ సౌతాఫ్రికాకు వరల్డ్‌ కప్‌ దూరం చేసింది! వాళ్ల దరిద్రానికి ఇదే నిదర్శనం!

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా కప్పును కైవసం చేసుకుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత.. టీ20 ప్రపంచ కప్పు గెలిచిన భారత్‌. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా జూన్‌ 29న సౌతాఫ్రికాతో ఫైనల్‌ ఆడి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విజయం తాలుకు ఆనందాన్ని ఇంకా భారత క్రికెట్‌ అభిమానులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. అయితే.. ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన సమయంలో తొలి బంతికే డేంజరస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కొట్టిన భారీ షాట్‌ను లాంగ్‌ ఆఫ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మన వైపు తిప్పేశాడు.

సూర్య పట్టిన ఆ క్యాచ్‌తోనే టీమిండియాకు వరల్డ్‌ కప్‌ దక్కిందని క్రికెట్‌ అభిమానులు భావించారు. మాజీ క్రికెటర్లు సైతం.. సూర్య పట్టుకుంది క్యాచ్‌ కాదు వరల్డ్‌ కప్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే.. ఆ క్యాచ్‌పై తీవ్ర వివాదం కూడా రాజుకుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ క్యాచ్‌ పట్టిన సయమంలో బౌండరీ రోప్‌ కాస్త వెనక్కి జరిగి ఉంది. బౌండరీ రోప్‌ ఇంతకు ముందు ఉన్న చోటు తెల్లటి మార్క్‌.. గడ్డి ఎండిపోయి.. బౌండరీ రోప్‌ గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, బౌండరీలైన్‌ కాస్త వెనక్కి జరిగి ఉండటంతో సూర్యకు ఒక అడుగు ముందుకేసి.. అసాధ్యమైన క్యాచ్‌ను అందుకునేందుకు వీలు చిక్కింది. అసలు ఆ బౌండరీ లైన్‌ ఎలా జరిగిందో అప్పుడు ఎవరికీ తెలియలేదు.

తాజాగా ఆ బౌండరీ రోప్‌ జరగడానికి కారణం ఇప్పుడు తెలిసిందే. మ్యాచ్‌ మొదలైన తొలి ఓవర్‌లోనే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మూడు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మార్కో జాన్సెన్‌ వేసిన తొలి ఓవర్‌లో మూడు సూపర్‌ షాట్లతో సూపర్‌ టచ్‌లో కనిపించాడు. తొలి ఓవర్‌ ఐదో బంతికి స్ట్రైయిట్‌గా ఒక షాట్‌ ఆడాడు. అది లాంగ్‌ ఆఫ్‌ దిశగా వెళ్లింది. దాన్ని ఆపేందుకు సౌతాఫ్రికా కెప్టెన్‌ అన్రిచ్‌ నోర్జే విశ్వప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్‌ దగ్గరకు వెళ్లిన తర్వాత పెద్ద డైవ్‌ కొట్టి బాల్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, బాల్‌ బౌండరీ వెళ్లిపోయింది.. అన్రిచ్‌ నోర్జే కొట్టిన డైవ్‌తో బౌండరీ లైన్‌ కూడా వెనక్కి జరిగింది. ఆ తర్వాత.. ఆ బౌండరీ లైన్‌ను సరిగ్గా సెట్‌ చేయలేదు. అదే సౌతాఫ్రికా కొంపముంచింది. బౌండరీ లైన్‌ సరిగ్గా సెట్‌ చేయకపోవడంతో.. అది ఇంతకు ముందు ఉన్నంత ముందుకు కాకుండా కాస్త వెనక్కి పెట్టారు.. అదే టీమిండియాకు కలిసి వచ్చింది. ఒక విధంగా కోహ్లీ కొట్టిన ఆ ఫోరే.. సూర్యకుమార్‌ యాదవ్‌కు మంచి క్యాచ్‌ పట్టుకునే అవకాశం కల్పించింది, టీమిండియా వరల్డ్‌ కప్‌ అందించింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సౌతాఫ్రికా దరిద్రానికి ఇదో నిదర్శనం అంటూ క్రికెట్‌ అభిమానలు కామెంట్‌ చేస్తున్నారు. పైగా మ్యాచ్‌ ప్రారంభమైన తొలి ఓవర్‌లోనే బౌండరీ లైన్‌ వెనక్కి జరగడంతో.. టీమిండియా బ్యాటింగ్‌లో బౌండరీ లైన్‌ కాస్త దూరం ఉంటుందిలే అని సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా దాన్ని లైట్‌ తీసుకోని ఉంటారని, కానీ.. అదే వారి కొంపముంచిందని కొంతమంది సరదాగా పేర్కొంటున్నారు. కోహ్లీ బౌండరీ కొట్టడం ఏంటి.. దాన్ని ఆపేందుకు వెళ్లిన అన్రిచ్‌ నోర్జే బౌండరీ లైన్‌ను వెనక్కి తోయడం ఏంటి.. అక్కడే సూర్య మ్యాచ్‌ టర్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడం ఏంటి.. అంతా చాలా విచిత్రంగా ఉన్నా.. ఇదంతా ఇండియాకే కలిసి రావడంతో భారత క్రికెట్‌ అభిమానులు సంతోషంగా ఉన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vishal Tyagi (@vishal.tyagi2018)