iDreamPost
android-app
ios-app

వీడియో: వరల్డ్ కప్ విజయం.. డ్యాన్సులు ఇరగదీసిన టీమిండియా క్రికెటర్లు! మాస్ సెలబ్రేషన్స్..

  • Published Jun 30, 2024 | 9:15 AM Updated Updated Jun 30, 2024 | 9:15 AM

Virat Kohli, Arshdeep Singh Dancing: వరల్డ్ కప్ విజయం తర్వాత ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డ్యాన్సులతో రెచ్చిపోయారు టీమిండియా ఆటగాళ్లు. గ్రౌండ్ లో మాస్ సెలబ్రేషన్స్ తో అదరగొట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Virat Kohli, Arshdeep Singh Dancing: వరల్డ్ కప్ విజయం తర్వాత ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డ్యాన్సులతో రెచ్చిపోయారు టీమిండియా ఆటగాళ్లు. గ్రౌండ్ లో మాస్ సెలబ్రేషన్స్ తో అదరగొట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

  • Published Jun 30, 2024 | 9:15 AMUpdated Jun 30, 2024 | 9:15 AM
వీడియో: వరల్డ్ కప్ విజయం.. డ్యాన్సులు ఇరగదీసిన టీమిండియా క్రికెటర్లు! మాస్ సెలబ్రేషన్స్..

ఒకే ఒక్క విజయం.. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకే ఒక్క విజయం.. 13 ఏళ్ల వరల్డ్ కప్ ఆకలిని తీర్చింది. దాంతో ఈ గెలుపు చిరస్మరణీయంగా గుండెల్లో పదిలంగా నిలిచిపోనుంది. మరి ఇంతటి విజయం సాధిస్తే.. ఆటగాళ్లు ఊరుకుంటారా? ప్లేయర్లే కాదు.. మ్యాచ్ చూసిన మనమే ఊరుకోం. ఊరు మెుత్తం ఒక్కాడికి వచ్చేలా సెలబ్రేషన్స్ చేస్తాం. ఇక ఈ వరల్డ్ కప్ విజయం తర్వాత ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డ్యాన్సులతో రెచ్చిపోయారు టీమిండియా ఆటగాళ్లు. గ్రౌండ్ లో మాస్ సెలబ్రేషన్స్ తో అదరగొట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టోర్నీ ప్రారంభం నుంచి విఫలం అవుతూ వస్తున్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగుల చేశాడు. మిగతా వారిలో అక్షర్ పటేల్ (47) పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం 177 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో సఫారీ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. క్లాసెన్ 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. జట్టును గెలిపించలేకపోయాడు. దాంతో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి.. వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.

ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ ను ముద్దాడిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ లోనే మాస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. గెలవగానే ఎమోషనల్ అయిన ప్లేయర్లు.. కప్ అందుకున్న తర్వాత తమ లో ఉన్న డ్యాన్సర్లను బయటకి తీశారు. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, రింకూ సింగ్ లు కలిసి డ్యాన్స్ అదరగొట్టారు. ముఖ్యంగా విరాట్, అర్షదీప్ కలిసి వేసిన స్టెప్పులు హైలెట్ అని చెప్పాలి. సంతోషంతో వీరిందరూ మాస్ డ్యాన్సులతో రెచ్చిపోవడంతో.. గ్రౌండ్ మెుత్తం ఆహ్లదకరంగా మారిపోయింది. యంగ్ ప్లేయర్లతో కలిసి కోహ్లీ చిన్నపిల్లాడిలా డ్యాన్స్ వేయడం అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ డ్యాన్సులు చూసి తీరాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మాస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet