SNP
Virat Kohli, Rohit Sharma, Mumbai Airport: టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ ఎంత గౌరవం ఇస్తాడో ఒక్క వీడియోతో బయటపడింది. ఆ వీడియో గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
Virat Kohli, Rohit Sharma, Mumbai Airport: టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ ఎంత గౌరవం ఇస్తాడో ఒక్క వీడియోతో బయటపడింది. ఆ వీడియో గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
SNP
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిందని అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత రెండోసారి టీమిండియా పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. జూన్ 29న వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్ ముగిసిన తర్వాత తుపాను కారణంగా భారత జట్టు ఆలస్యంగా ఇండియాకు రావడం.. ఆ తర్వాత ప్రధానితో భేటీ, ముంబైలో విక్టరీ పరేడ్, వాంఖడేలో సన్మానం ఇలా సెలెబ్రేషన్స్ ఒక రేంజ్‌లో జరిగాయి. ఇంత బిజీ సెలబ్రేషన్స్‌లో స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. తమ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
జూన్ 29న ఫైనల్ ఆడిన తర్వాత.. వెస్టిండీస్ నుంచి బయలుదేరి జులై 4న గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగింది టీమిండియా. అక్కడ క్రికెట్ అభిమానులు రోహిత్ సేనకు ఘనస్వాగతం అందించారు. ఆ తర్వాత.. భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి ముంబైకి వచ్చారు. ఢిల్లీ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు విస్తారా విమానంలో వచ్చిన భారత జట్టుకు.. ఎయిర్‌పోర్టు వాళ్లు వాటర్ సెల్యూట్‌తో గౌరవించారు. ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తున్న సమయంలో.. భారత జట్టును అభిమానులు చుట్టుముట్టేశారు. ఆటగాళ్లకు సెక్యురిటీగా పోలీసులు కూడా భారీగానే ఉన్నారు.
అంత గజిబిజిలో కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని మర్చిపోలేదు. ఆ తోపులాటలో కోహ్లీ ముందు నడుస్తున్నాడు. అతని వెనుక మిగతా ఆటగాళ్లు ఉన్నారు. సరిగ్గా ఎయిర్ పోర్టుకు వచ్చే సమయంలో.. రోహిత్ శర్మ కోసం వెనుక్కి తిరిగి చూసిన కోహ్లీ.. అతన్ని ముందు ఉండాల్సిందిగా కోరాడు. రోహిత్‌ను ముందు రమ్మని పిలిచి.. అతను వచ్చే వరకు పక్కననిలబడ్డాడు. రోహిత్ ముందు నడుస్తుంటే.. వెనుక జడేజాతో కలిసి కోహ్లీ వచ్చాడు. ఒక జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ను ముందు ఉంచాలన్న చిన్న ఆలోచనతో తన కెప్టెన్‌కు కోహ్లీ ఎంత గౌరవం ఇస్తాడో అర్థమైందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli asking Rohit Sharma to come in front and lead the team.
– The mutual love between them! 🥹❤️pic.twitter.com/NU0KvcydOt
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 6, 2024