iDreamPost
android-app
ios-app

కొత్త ఇల్లు కట్టుకుంటున్న విరాట్ కోహ్లీ.. ఏకంగా 8 ఎకరాల్లో!

  • Author Soma Sekhar Published - 03:25 PM, Mon - 14 August 23
  • Author Soma Sekhar Published - 03:25 PM, Mon - 14 August 23
కొత్త ఇల్లు కట్టుకుంటున్న విరాట్ కోహ్లీ.. ఏకంగా 8 ఎకరాల్లో!

విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా.. రికార్డుల రారాజుగా, ఛేజింగ్ కింగ్ గా వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. రెస్ట్ తీసుకుంటూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ దంపతులకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే? విరాట్ దంపతులు కొత్తింటి నిర్మాణం చేపట్టారు. విరుష్క దంపతుల న్యూ హౌజ్ ఏకంగా 8 ఎకరాల్లో ఉండబోతోందట.

విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు గతేడాది మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో 8 ఎకరాల ల్యాండ్ ను కొనుగోలు చేశారు. 19.24 కోట్లతో ఈ భూమిని కొనుగోలు చేశారు. తీరప్రాంతంలోని ఈ విశాలమైన ల్యాండ్ లో కొత్తింటి నిర్మాణం మెుదలుపెట్టారు ఈ దంపతులు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రముఖ ఆర్కిటెక్ మజుందార్ బ్రావో ఈ ఇంటి నిర్మాణాన్ని డిజైన్ చేశాడు. అన్ని అనుమతులను పూర్తి చేసుకుని ఈ ఇంటి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ ఇల్లు పూర్తి అయ్యే సరికి ఇంకో రెండు సంవత్సరాలు పట్టొచ్చని తెలుస్తోంది.

కాగా.. ఈ 8 ఎకరాల ల్యాండ్ కు సంబంధించిన అన్ని విషయాలు విరాట్ సోదరుడు వికాస్ పూర్తి చేశాడు. సమీరా హబిటేట్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ దగ్గర విరాట్ దంపతులు ఈ ల్యాండ్ ను కొనుగోలు చేశారు. కాగా.. కొత్తింటి పనులను ఇటీవలే పరిశీలించారు విరుష్క దంపతులు. మరి 8 ఎకరాల్లో విశాలమైన ఇల్లు కట్టుకుంటున్న విరాట్ కోహ్లీ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: విండీస్‌పై సిరీస్‌ ఓటమి.. హెడ్‌ కోచ్‌ ద్రావిడ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet