iDreamPost

విండీస్‌పై సిరీస్‌ ఓటమి.. హెడ్‌ కోచ్‌ ద్రావిడ్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • Published Aug 14, 2023 | 1:45 PMUpdated Aug 14, 2023 | 1:45 PM
  • Published Aug 14, 2023 | 1:45 PMUpdated Aug 14, 2023 | 1:45 PM
విండీస్‌పై సిరీస్‌ ఓటమి.. హెడ్‌ కోచ్‌ ద్రావిడ్‌ కామెంట్స్‌ వైరల్‌!

వెస్టిండీస్‌ టూర్‌ను టీమిండియా ఓటమితో ముగించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో, మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో నెగ్గిన భారత్‌.. ఐదు టీ20ల సిరీస్‌ను మాత్రం 3-2తో కోల్పోయింది. తొలి మూడు టీ30 మ్యాచ్‌లను కరేబియన్‌ గడ్డపై జరగ్గా.. చివరి రెండు టీ20లు అమెరికాలో జరిగాయి. మొత్తం మీద సిరీస్‌ డిసైడర్‌గా మారిన చివరి టీ20లో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌ కోల్పోయింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌పై టీమిండియా సిరీస్‌ ఓటమిని చవిచూసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. అలాగే బౌలర్లు కూడా చేతులెత్తేయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే.. ఈ ఓటమి తర్వాత భారత జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో యువ టీమిండియా ప్రదర్శన గురించి ద్రావిడ్‌ మాట్లాడుతూ.. ఇది యువ జట్టు, అభివృద్ధి చెందుతున్న జట్టని, ఆటలో ఎత్తుపల్లాలు ఇంకా చూడాల్సిన జట్టని అన్నాడు. అలాగే ఈ యంగ్‌ టీమ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో డెప్త్‌ను పెంచాలని అనుకున్నట్లు చెప్పాడు. వెస్టిండీస్‌ జట్టులో చివరిగా బ్యాటింగ్‌కు వచ్చే అల్జారీ జోసెఫ్‌ సైతం షాట్లు ఆడతాడని, టీమిండియాలో సైతం అలా బ్యాటింగ్‌ లైనప్‌ను పటిష్టం చేయాలని అనుకున్నట్లు ద్రావిడ్‌ తెలిపారు. అయితే.. బ్యాటింగ్‌లో డెప్త్‌ పెంచేందుకు బౌలింగ్‌ను బలహీన పర్చమని కూడా ద్రావిడ్‌ వెల్లడించారు. ఈ విషయంపై తాను ఫోకస్‌ పెట్టినట్లు పేర్కొన్నారు.

అయితే.. మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ప్రారంభం కానున్న తరుణంలో ఇలాంటి ప్రదర్శనను ఎలా చూస్తారని ఎదురైన ప్రశ్నకు ద్రావిడ్‌ సమాధానమిస్తూ.. అసలు ఇది తమ వన్డే టీమ్‌ కాదని, చాలా మంది ఆటగాళ్లు వరల్డ్‌ కప్‌ కోసం ఉన్నారని అన్నాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యార్‌, రవీంద్ర జడేజా, మొహమ్మద్‌ సిరాజ్‌, షమీ, బుమ్రా ఇలా.. ప్రధాన ఆటగాళ్లు ఈ జట్టులో లేరు. వారంతా తిరిగి టీమ్‌లోకి వస్తే.. తమ వరల్డ్‌ కప్‌ టీమ్‌ పటిష్టంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో ద్రావిడ్‌ ఆ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియాపై సిరీస్‌ విజయం తర్వాత ఎమోషనలైన విండీస్‌ కెప్టెన్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి