iDreamPost
android-app
ios-app

కోహ్లీకి కొడుకు పుట్టాడని.. పాకిస్థాన్‌లో భారీ వేడుకలు! ఇదేం క్రేజ్‌ స్వామి

  • Published Feb 21, 2024 | 3:44 PM Updated Updated Feb 21, 2024 | 3:44 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రైన సందర్భంగా పాకిస్థాన్ లో ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ భారీ వేడుకలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రైన సందర్భంగా పాకిస్థాన్ లో ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ భారీ వేడుకలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Published Feb 21, 2024 | 3:44 PMUpdated Feb 21, 2024 | 3:44 PM
కోహ్లీకి కొడుకు పుట్టాడని.. పాకిస్థాన్‌లో భారీ వేడుకలు! ఇదేం క్రేజ్‌ స్వామి

టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. కోహ్లీ-అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. విరుష్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇండియాతో పాటుగా దాయాది దేశం పాకిస్థాన్ లో కూడా కోహ్లీకి కొడుకుపుట్టిన సందర్భంగా భారీ వేడుకలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లీ.. తనదైన బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క ఇండియాలోనే కాదు.. దాయాది దేశం అయిన పాకిస్థాన్ లో కూడా విరాట్ కు వీరాభిమానులు ఉన్నారు. ఇటీవలే కోహ్లీ-అనుష్క దంపతులకు మగబిడ్డ జన్మించాడు. అతడి పేరు ‘అకాయ్’ అని కూడా పెట్టారు. ఫిబ్రవరి 15న అకాయ్ జన్మిస్తే.. 20వ తారీఖున ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ, రాజకీయ ప్రముఖులు విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే కోహ్లీకి కొడుకు పుట్టాడు అన్న వార్త తెలియగానే.. పాక్ లో ఉన్న విరాట్ అభిమానులు సంతోషపడుతున్నారు. పాక్ లో రోడ్లపై స్వీట్స్ పంచుతూ.. తమ ఆనందాన్ని పంచుకున్నారు. విరాట్ తాము బిగ్ ఫ్యాన్స్ మని, అతడు ఎంతో గొప్ప ఆటగాడు అని, కోహ్లీ ప్రపంచంలోనే అద్భుతమైన బ్యాటరని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. ఓ ఇండియన్ క్రికెటర్ కు కొడుకుపుడితే.. ఇంతలా సెలబ్రేట్ చేసుకోవడం ప్రపంచాన్నే ఆశ్యర్యపరుస్తోంది. అయితే ఇదంతా కోహ్లీ ఆటతీరు, వ్యక్తిత్వం కారణంగానే వచ్చిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కోహ్లీకి కొడుకు పుడితే.. పాక్ లో సంబరాలు చేసుకోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మోడల్‌ ఆత్మహత్య! పోలీసుల విచారణలో SRH స్టార్‌ క్రికెటర్‌

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio