iDreamPost
android-app
ios-app

కోహ్లీ చేతిపై కొత్త టాటూ.. కొడుకు పేరు ముందే ఫిక్స్ అయ్యాడు!

  • Published Feb 22, 2024 | 10:25 AM Updated Updated Feb 22, 2024 | 10:33 AM

టీమిండియా సీనియర్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. విరుష్క దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు.

టీమిండియా సీనియర్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. విరుష్క దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు.

  • Published Feb 22, 2024 | 10:25 AMUpdated Feb 22, 2024 | 10:33 AM
కోహ్లీ చేతిపై కొత్త టాటూ.. కొడుకు పేరు ముందే ఫిక్స్ అయ్యాడు!

భారత స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ ఎంతో ఫిట్​గా ఉంటాడనేది తెలిసిందే. టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా మిస్సవని కోహ్లీ.. ఇటీవల వ్యక్తిగత కారణాలు అంటూ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఆఫ్ఘానిస్థాన్​ సిరీస్​తో పాటు ఇంగ్లండ్​ సిరీస్​లోనూ ఇదే జరిగింది. ఇంగ్లీష్ టీమ్​తో మొత్తం టెస్ట్ సిరీస్​కు దూరంగా ఉంటున్నాడు విరాట్. అయితే దీనికి రీజన్ ఏంటనేది తెలిసొచ్చింది. కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. విరుష్క దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కొడుక్కి అకాయ్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా బ్యాటర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. దీంతో దేశంలోనే కాదు వరల్డ్ వైడ్​గా ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో విరాట్ చేతికి ఉన్న కొత్త టాటూ ఫొటో వైరల్ అవుతోంది. అసలు ఏంటా టాటూ? దానికి ‘అకాయ్’ పేరుకు ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కోహ్లీ ఎడమ చేతికి ఉన్న ఓ టాటూ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా విరాట్ చేతినిండా టాటూలు ఉంటాయనేది తెలిసిందే. అలాగే ఎడమ చేతికి కూడా పెద్దగా టాటూలు ఉన్నాయి. కానీ అందులో సరిగ్గా మధ్యలో పరమశివుడు ధ్యానంలో ఉన్న టాటూ ఉంది. హిమాలయ పర్వతాలపై శంకరుడు ధ్యాన ముద్రలో ఉండగా వెనుక వైపున త్రిశూలం ఉండటాన్ని ఇందులో చూడొచ్చు. శివుడి పేరు మీదుగానే కొడుకు పుడితే అకాయ్ అనే పేరు పెట్టాలని విరుష్క దంపతులు ముందే ఫిక్స్ అయ్యారని టాక్. ఒకవేళ కూతురు పుట్టినా శివపార్వతులకు సంబంధించిన పేరే పెట్టాలని వాళ్లు అనుకున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ కోహ్లీ చేతికి ఉన్న కొత్త టాటూ ఫొటో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ శంకరుడి మీద విరాట్​కు ఉన్న భక్తి, విశ్వాసానికి ఇది నిదర్శనమని అంటున్నారు.

విరాట్​కు శివుడు మీద అపార భక్తి ఉన్నా అతడు దాన్ని పెద్దగా బయట చూపించుకోలేదు. అయితే కొన్నేళ్ల కింద ఫామ్ కోల్పోవడం, కెరీర్ పరంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవడంతో ఉజ్జయిని మహంకాల్ టెంపుల్​కు వెళ్లాడు. సతీమణి అనుష్కతో కలసి అక్కడ శివుడికి ప్రత్యేక పూజలు చేశాడు. ఆ తర్వాత తిరిగి ఫామ్​ను అందుకున్న కోహ్లీ 2.O వెర్షన్​లోకి వచ్చేశాడు. వరుసగా సూపర్బ్ నాక్స్ ఆడుతున్నాడు. గతేడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్​లో టాప్ స్కోరర్​గా నిలిచాడు. శివుడి మహత్యం వల్లే కోహ్లీ కెరీర్​లో మళ్లీ పుంజుకున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అందుకే తన చేతి మీద శంకరుడ్ని చెక్కించుకున్నాడని.. తన కొడుక్కి కూడా శివుడు అనే అర్థం వచ్చేలా అకాయ్ అనే పేరు పెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ చేతికి ఉన్న టాటూ ఫొటో వైరల్ అవుతోంది. మరి.. కోహ్లీ చేతిపై ఉన్న కొత్త టాటూ ఫొటో మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వాళ్ల మాటల్ని అస్సలు పట్టించుకోను.. గిల్ షాకింగ్ కామెంట్స్!

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş