iDreamPost
android-app
ios-app

వీడియో: అమెరికాలో అనుష్కతో కలిసి షికారుకెళ్లిన కోహ్లీ! ఏం జరిగిందో చూడండి..!

  • Published Jun 08, 2024 | 2:48 PM Updated Updated Jun 08, 2024 | 2:48 PM

Virat Kohli, Anushka Sharma, India vs Pakistan, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ కంటే ముందు కోహ్లీ, తన భార్యతో కలిసి అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Anushka Sharma, India vs Pakistan, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ కంటే ముందు కోహ్లీ, తన భార్యతో కలిసి అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 08, 2024 | 2:48 PMUpdated Jun 08, 2024 | 2:48 PM
వీడియో: అమెరికాలో అనుష్కతో కలిసి షికారుకెళ్లిన కోహ్లీ! ఏం జరిగిందో చూడండి..!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. భాతర కాల మాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌కి ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు. కోహ్లీ-అనుష్క అమెరికా వీధుల్లో తిరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే.. కోహ్లీ పెద్ద సెక్యూరిటీ లేకుండానే కనిపించాడు. ఇదే కోహ్లీ ఇండియాలో ఇలా లెస్‌ సెక్యూరిటీతో తిరిగితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమని ఆ వీడియో చూసిన క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోహ్లీతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడతారని, కానీ, అమెరికాలో కోహ్లీ చాలా ఫ్రీగా తిరుగుతున్నాడంటూ పేర్కొంటున్నారు. కోహ్లీ గురించి పెద్దగా తెలియని అమెరికన్లు అతను ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా నార్మల్‌గా వెళ్లిపోతుండటం ఆ వీడియోలో చూడొచ్చు.

ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్‌ గురించి మాట్లాడుకుంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాక్‌పై కోహ్లీ ఎలాంటి ఇన్నింగ్స్‌ ఆడాడో ఇప్పుడు కూడా అలాంటి మ్యాజిక్‌ను రిపీట్‌ చేయాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ వరల్డ్‌ కప్‌లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. కోహ్లీ టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో హరీష్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో కొట్టిన స్ట్రెయిట్‌ షాట్‌ను ఐసీసీ షాట్‌ ఆఫ్‌ ది సెంచరీగా పేర్కొంది. కానీ, ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి ముందు వామప్‌ మ్యాచ్‌ ఆడలేదు, ఐర్లాండ్‌పై కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురి అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.