Somesekhar
అభిమానులు ముద్దుగా విరాట్ కోహ్లీని 'గోట్' అని పిలుచుకుంటారు. అయితే విరాట్ ను ఎందుకు అలా పిలుస్తారో ఈ ఒక్క లెక్క చూస్తే మీరే షాక్ అవుతారు. మరి ఆ లెక్కలు ఏంటో చూసేద్దాం పదండి.
అభిమానులు ముద్దుగా విరాట్ కోహ్లీని 'గోట్' అని పిలుచుకుంటారు. అయితే విరాట్ ను ఎందుకు అలా పిలుస్తారో ఈ ఒక్క లెక్క చూస్తే మీరే షాక్ అవుతారు. మరి ఆ లెక్కలు ఏంటో చూసేద్దాం పదండి.
Somesekhar
విరాట్ కోహ్లీ.. టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు.. అంతకు మించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులు అతడి పేరు చెప్పగానే గుర్తుకొచ్చే మాటలు. తన బ్యాట్ తో పరుగుల సునామీని సృష్టిస్తూ.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న ఓ వీరుడు కోహ్లీ. అందుకే అతడిని అభిమానులు ముద్దుగా ‘గోట్’ అని పిలుచుకుంటారు. అయితే విరాట్ ను ఎందుకు అలా పిలుస్తారో ఈ ఒక్క లెక్క చూస్తే మీరే షాక్ అవుతారు. మరి ఆ లెక్కలు ఏంటో చూసేద్దాం పదండి.
శ్రీలంకపై టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అదే జోరును వన్డే సిరీస్ లో కూడా చూపించాలని ఆరాటపడుతోంది. వన్డేల కోసం సీనియర్లు జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లతో పాటుగా మరికొంత మంది సీనియర్లు నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక నెట్స్ లో కోహ్లీ కొట్టే షాట్స్ కు కోచ్ గంభీర్ ఇచ్చే రియాక్షన్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీని అభిమానులు ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అని ఎందుకంటారో మీకు ఓ మచ్చుతునక గురించి ఇప్పుడు చెబుతాను. అదేంటంటే?
శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? వన్డే కెరీర్ లో ఇప్పటి వరకు 292 మ్యాచ్ లు ఆడిన విరాట్.. 13, 848 పరుగులు సాధించాడు. ఇందులో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ తో ఆడే వన్డే సిరీస్ ఆడే శ్రీలంక స్క్వాడ్ మెుత్తం చేసిన పరుగుల కంటే.. కోహ్లీనే ఎక్కువ రన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం వన్డే ఆడే లంక ప్లేయర్లు అందరూ కలిసి 12, 885 రన్స్ చేశారు. ఈ లెక్కలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అందుకే విరాట్ కోహ్లీని గోట్ అనేది అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి శ్రీలంక స్క్వాడ్ కంటే ఎక్కువ పరుగులు చేసిన కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli alone has more ODI runs than the entire Sri Lanka squad 🤯 pic.twitter.com/DpZFlqq6rz
— Sport360° (@Sport360) August 1, 2024