iDreamPost
android-app
ios-app

Virat Kohli: చాలా కాలం తర్వాత కెప్టెన్సీ చేసిన కోహ్లీ! 2 ఓవర్లలోనే తన మార్క్‌ చూపించాడు!

  • Published Jan 19, 2024 | 12:01 PM Updated Updated Jan 19, 2024 | 12:01 PM

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీకి దూరమై చాలా కాలం అవుతుంది. కానీ, ఒక్కసారి కెప్టెన్‌గా వ్యవహరించాల్సి వస్తే.. తాను ఎలా ఉంటాడో మరోసారి చూపించాడు. తాజాగా కోహ్లీ కెప్టెన్‌గా తన మార్క్‌ చూపించాడు.

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీకి దూరమై చాలా కాలం అవుతుంది. కానీ, ఒక్కసారి కెప్టెన్‌గా వ్యవహరించాల్సి వస్తే.. తాను ఎలా ఉంటాడో మరోసారి చూపించాడు. తాజాగా కోహ్లీ కెప్టెన్‌గా తన మార్క్‌ చూపించాడు.

  • Published Jan 19, 2024 | 12:01 PMUpdated Jan 19, 2024 | 12:01 PM
Virat Kohli: చాలా కాలం తర్వాత కెప్టెన్సీ చేసిన కోహ్లీ! 2 ఓవర్లలోనే తన మార్క్‌ చూపించాడు!

విరాట్‌ కోహ్లీ చాలా కాలం పాటు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. భారత సక్సెస​్‌ఫుల్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్‌ వారసుడిగా జట్టు పగ్గాలు అందుకున్నాడు. ధోని కెప్టెన్సీలో వచ్చినట్లు కప్పులు మాత్రం రాలేదు కానీ, జట్టును ఎక్కడా తగ్గకుండా నడిపించాడు. వరల్డ్‌ కప్‌ క్రికెట్‌పై ధోని ఉన్నప్పుడు టీమిండియా ఎలాంటి డామినేషన్‌ను చూపించిందో.. కోహ్లీ​ కెప్టెన్సీలో అంతకంటే మించిపోయింది. ధోని లెగసీని కోహ్లీ అద్భుతంగా క్యారీ చేశాడు. అయితే.. ఐసీసీ వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో టీమిండియా ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌లో నిరాశపర్చింది. కానీ, టెస్టు క్రికెట్‌లో కోహ్లీ మరె కెప్టెన్‌కు అందని రేంజ్‌లో నిల్చున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా టెస్ట్‌ క్రికెట్‌లో రారాజుగా అవసరించింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది.

అలా కెప్టెన్‌గా సూపర్‌ అనిపించుకున్న తర్వాత.. కొన్ని ఊహించని ఘటనలతో విరాట్‌ కోహ్లీ టీ20, టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తానే స్వయంగా తప్పుకున్నాడు. వన్డే కెప్టెన్సీ నుంచి మాత్రం బీసీసీఐనే కోహ్లీని తప్పించింది. ఏది ఏమైనా.. భారత క్రికెట్‌లో చరిత్రలో విరాట్‌ కోహ్లీ ఒక అద్భుతమైన కెప్టెన్‌. అయితే.. చాలా కాలం తర్వాత కోహ్లీ టీమిండియాకు స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఈ అదుదైన ఘనట చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ కొద్దిసేపు స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌గా వ్యవహరించడంతో క్రికెట్‌ అభిమానులంతా ఫుల్‌ ఖుషీ అయ్యారు. అయితే.. కేవలం రెండు ఓవర్లలోనే కోహ్లీ తన మార్క్‌ కెప్టెన్సీ చూపించడంతో.. అదీ కోహ్లీ కెప్టెన్సీ అంటే అంటూ అతని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు.

ఆ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయడంతో.. ఫీల్డ్‌లోకి కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఈ లోపు గ్రౌండ్‌లోకి కోహ్లీ స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌గా టీమిండియా దిగింది. బౌలింగ్‌ ప్రారంభించే ముందుకు టీమ్‌ హుడిల్‌లో కోహ్లీ మాట్లాడాడు. అలాగే అద్భుతమైన ఫీల్డిండ్‌ సెట్‌ చేశాడు. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌ వేస్తున్న క్రమంలో అతని దగ్గరికి వెళ్లి.. చర్చించడం కూడా క్రికెట్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. కోహ్లీ గేమ్‌లో కెప్టెన్‌గా ఎంత ఇన్వాల్‌ అయిపోతాడో మరోసారి నిరూపితమైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 213 పరుగుల టార్గెట్‌ను ఆఫ్గాన్‌ అందుకోలేకపోయినా.. 212 పరుగులకే భారత స్కోర్‌ను సమం చేసింది. కానీ, కోహ్లీ కెప్టెన్సీ చేసిన తొలి రెండు ఓవర్లలో ఆఫ్ఘాన్‌ తడబడింది. తొలి ఓవర్‌లో 4 పరుగులు, రెండో ఓవర్‌లొ 10 పరుగులు ఇచ్చారు భారత బౌలర్లు. రెండో ఓవర్‌ వేసిన ఆవేశ్‌ ఖాన్‌ తన రెండో బంతికి సిక్స్‌ ఇవ్వగానే కోహ్లీ వెళ్లి అతనితో మాట్లాడిన తర్వాత.. మిగిలిన 4 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇలా కోహ్లీ తనకు దొరికిన రెండు ఓవర్లలోనే తన మార్క్‌ కెప్టెన్సీని చూపించాడు. మరి కోహ్లీ కెప్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.