భారతదేశంలో క్రికెట్ ను మతంగా.. క్రికెటర్లను దేవుళ్లుగా భావిస్తుంటారు అభిమానులు. ఇక క్రికెట్ పై అలాగే క్రికెటర్లపై అభిమానులు తమ ప్రేమను రకరకాలుగా చూపిస్తుంటారు. ఇక సాధారణంగా క్రికెట్ ఎక్కడ ఆడతారు? అంటే వెంటనే గ్రౌండ్ లో అన్న సమాధానం వస్తుంది. కానీ ఈ వీడియో చూశాక మీ సమాధానం మారుతుంది. అవును క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు, నదిలో కూడా ఆడొచ్చు అని నిరూపించారు కొత్త మంది కుర్రాళ్లు. పారే నదిలో క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీరు గ్రౌండ్ లో క్రికెట్ ఆడటం చూసుంటారు.. బురదలో క్రికెట్ ఆడటం చూసుంటారు. కానీ ప్రవహించే నదిలో క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా? బహుశా మీరు చూసుండరు. పారే నదిలో కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడారు. ఇది ఎక్కడో అనుకుంటే మీరు పొరపడినట్లే.. మన భారతదేశంలోనే. క్రికెట్ ను మతంగా భావించే భారత్ లో.. ఆటగాళ్లను దేవుళ్లుగా భావిస్తారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. అంతర్జాతీయ మ్యాచ్ కు తీసిపోని విధంగా కొందరు కుర్రాళ్లు పారే నీటిపై క్రికెట్ ఆడారు.
ఇక ఈ ఆటలో ఓ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. కాని బాల్ మిస్ అయ్యి ఎడ్జ్ తీసుకుని సరాసరి కీపర్ చేతులో పడింది. దాంతో ఫీల్డర్స్ అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దాంతో రివ్యూ కోరగా.. అచ్చం నేషనల్ మ్యాచ్ లాగే రిప్లే లో చూపించారు. ఆ తర్వాత బాల్ బ్యాట్ కు తాకిందని, నిర్దారించుకుని అంపైర్ అవుట్ ఇచ్చాడు. దాంతో కుర్రాళ్లు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. పలు మీమ్స్ తో అదరగొడుతున్నారు. రేయ్ ఎవర్రా మీరంతా.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు అంటూ ప్రశంసిస్తున్నారు. మీ క్రియేటివిటికి ఓ దండం రా బాబు.. ఎక్కడ్నించి వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
పారే నదిలో క్రికెట్ మ్యాచ్.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నారేంట్రా! pic.twitter.com/ji5LeY8jV6
— Reddy Challa (@ReddyChall3811) June 29, 2023