SNP
Vinesh Phogat, Dehydration, Paris Olympics 2024, Wrestling: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్స్‌కి ముందు అనర్హత వేటుకు గురైన రెజర్ల వినేష్ ఫొగాట్.. ఆస్పత్రి పాలైంది. ఇంతకీ ఆమెకు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
Vinesh Phogat, Dehydration, Paris Olympics 2024, Wrestling: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్స్‌కి ముందు అనర్హత వేటుకు గురైన రెజర్ల వినేష్ ఫొగాట్.. ఆస్పత్రి పాలైంది. ఇంతకీ ఆమెకు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
SNP
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై ఫైనల్స్‌కు ముందు అనర్హత వేటు పడింది. 50 కేజీల ఈవెంట్‌లో ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధం అయిన వినేష్.. నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండటంతో ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తూ.. ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 50 కేజీల ఈవెంట్‌లో పాల్గొన్నాలంటే.. 50 కేజీల బరువు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. 50 కేజీల కంటే 10 గ్రాములు ఎక్కువ బరువు అధికంగా ఉన్నా.. వారిని పోటీకి అనుమతించరు.
క్వార్టర్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. దీంతో.. వినేష్ ఫొగాట్ కచ్చితంగా గోల్డ్ మెడల్ గెలిచి, ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ తెస్తుందని అంతా భావించారు. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్ మ్యాచ్‌కి ముందు బరువు చెక్ చేసే సమయంలో 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. అయితే.. 50 కేజీల బరువు ఉండేందుకు ఫైనల్ మ్యాచ్‌కి ముందు రాత్రి మొత్తం వర్క్‌అవుట్స్ చేయడం వినేష్ ఫొగాట్ తీవ్ర అస్వస్థతకు గురైంది.
దీంతో ఆమెను హుటాహుటినా పారిస్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. 50 కేజీల బరువుకు వచ్చేందుకు రాత్రి మొత్తం వినేష్ రకరకాల వ్యాయామాలు చేయడంతో బాగా అలసిపోవడంతో పాటే.. శరీరం డీహైడ్రేషన్‌కు గురైంది. ఫైనల్ మ్యాచ్ ఎలాగో క్యాన్సిల్ కావడం, ఆమెపై అనర్హత వేటు వేయడంతో నివేష్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణం చూపి.. ఆమెను డిస్‌క్వాలిఫై చేయడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vinesh Phogat could’ve secured a Silver Medal had the support staff withdraw her name from the Final declaring her ill before the weight check. pic.twitter.com/pre3V7Gw7i
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 7, 2024