Nidhan
Virat Kohli Carries Anushka Sharma's Shopping Bags: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలిసిందే. కోహ్లీ ఏదైనా సాధిస్తే అనుష్క కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతుంది. సక్సెస్, ఫెయిల్యూర్ ఏదొచ్చినా అనుష్కతోనే పంచుకుంటాడు విరాట్.
Virat Kohli Carries Anushka Sharma's Shopping Bags: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలిసిందే. కోహ్లీ ఏదైనా సాధిస్తే అనుష్క కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతుంది. సక్సెస్, ఫెయిల్యూర్ ఏదొచ్చినా అనుష్కతోనే పంచుకుంటాడు విరాట్.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రొఫెషనల్ లైఫ్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో పర్సనల్ లైఫ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. కాస్త ఫ్రీ టైమ్ దొరికినా ఫ్యామిలీతో గడిపేందుకు ప్రయత్నిస్తాడు. భార్య అనుష్క శర్మతో అతడు ఎంత అన్యోన్యంగా ఉంటాడో తెలిసిందే. విరాట్ ఏదైనా సాధిస్తే అనుష్క సంతోషంతో మురిసిపోతుంది. ఒక్కోసారి కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతుంది. కోహ్లీ కూడా ఏది ఉన్నా అనుష్కతోనే పంచుకుంటాడు. సక్సెస్, ఫెయిల్యూర్ ఏదొచ్చినా ఆమెతోనే షేర్ చేసుకుంటాడు. ఈ స్టార్ కపుల్ ఖాళీ సమయంలో వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలసి లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు కింగ్.
అనుష్కతో కలసి లండన్ వీధుల్లో కోహ్లీ తిరుగుతున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఇందులో షాపింగ్ బ్యాగుల్ని మోసుకుంటూ కనిపించాడు విరాట్. వైట్ టీ-షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని చేతులకు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని అనుష్క నడుస్తుండగా.. పింక్ కలర్ షర్ట్, నెత్తికి క్యాప్‌తో ఉన్న కోహ్లీ బ్యాగులు పట్టుకొని ఆమెను ఫాలో అవుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఎంత బిగ్ స్టార్ అయినా భార్యకు గులామే అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్‌లో టాప్ క్రికెటర్ అయినా భార్య బ్యాగులు మోయక తప్పదని అంటున్నారు. ఇంకొందరు మాత్రం కోహ్లీ సింప్లిసిటీ సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. అంత పెద్ద స్టార్ అయినా సాధారణ మనుషుల్లా ఉండటం అందరి వల్లా కాదని.. పర్సనల్ లైఫ్‌లో ఇంత సింపుల్‌గా ఉండటాన్ని ప్రశంసించాల్సిందేనని చెబుతున్నారు.
ఇక, ఈ మధ్య కోహ్లీ ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నాడు. టీమిండియా మ్యాచ్‌లు లేని టైమ్‌లో అక్కడికి వెళ్లిపోతున్నాడు. అనుష్క శర్మ సహా ఇద్దరు పిల్లలు అక్కడే ఉంటుండటంతో విరాట్ కూడా ముంబై-లండన్ మధ్య ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాడు. దీంతో అతడు అక్కడే సెటిల్ అయిపోతాడని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే లండన్‌లో ఓ ఖరీదైన బంగ్లాను వాళ్లు కొనేశారని, త్వరలో అక్కడికి షిఫ్ట్ అవుతారని వినిపిస్తోంది. లండన్‌లో అయితే సెలెబ్రిటీ స్టేటస్‌కు దూరంగా, సింపుల్‌గా మామూలు జనాల్లా లైఫ్‌ను లీడ్ చేయొచ్చనే ఆలోచనతో విరుష్క దంపతులు ఉన్నారని సమాచారం. కొడుకు అకాయ్ పుట్టిన తర్వాత ఈ ఇద్దరూ అక్కడే ఎక్కువ సమయం గడపడం, వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ ముగిశాక, అలాగే లంక టూర్ తర్వాత కూడా కోహ్లీ నేరుగా లండన్‌కు వెళ్లిపోవడంతో అక్కడే సెటిల్ అవుతారనే రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్లయింది. మరి.. స్టార్ హోదా పక్కనబెట్టి కోహ్లీ సామాన్యుడిలా భార్యతో షాపింగ్ చేయడం, బ్యాగులు మోయడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.