వీడియో: వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌పై అర్షదీప్‌ ఆగ్రహం! మ్యాచ్‌ తర్వాత..

Arshdeep Singh, Shubman Gill, Ravi Bishnoi, IND vs SL: శ్రీలంకపై రెండో విజయం తర్వాత.. భారత ఆటగాళ్లు సరదాగా గడిపారు. కానీ, ఈ క్రమంలోనే అర్షదీప్‌ సింగ్‌.. శుబ్‌మన్‌ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

Arshdeep Singh, Shubman Gill, Ravi Bishnoi, IND vs SL: శ్రీలంకపై రెండో విజయం తర్వాత.. భారత ఆటగాళ్లు సరదాగా గడిపారు. కానీ, ఈ క్రమంలోనే అర్షదీప్‌ సింగ్‌.. శుబ్‌మన్‌ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో.. 2-0తో సిరీస్‌ భారత్‌ వశమైంది. ఆదివారం పల్లెకలె వేదికగా జరిగిన రెండో టీ20లో సూర్య సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అయింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. మంచి టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచింది. మ్యాచ్‌ మధ్యలో మళ్లీ వర్షం రావడంతో టీమిండియాకు టార్గెట్‌ను కుదించారు అంపైర్లు. అయినా కూడా సూర్య అండ్‌ కో ఆ టార్గెట్‌ను ఊదిపారేసింది. సిరీస్‌ గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్ల మధ్య మ్యాచ్‌ తర్వాత ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

టీమిండియా స్టార్‌ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్.. వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం అర్షదీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ మధ్య చిట్‌చాట్‌ జరిగింది. మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన రవి బిష్ణోయ్‌తో అర్షదీప్‌ మాట్లాడి, మ్యాచ్‌ గురించి అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే చిట్‌ చాట్‌ ప్రారంభానికి ముందు అక్కడే ఉన్న గిల్‌.. అది స్టార్ట్‌ అయ్యే ముందు అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. ‘వైస్‌ కెప్టెన్‌.. స్టే’ అంటూ అర్షదీప్‌ సింగ్‌ కాస్త పెద్ద గొంతుతో గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే.. ఇది సరదాగానే జరిగిందే. అర్షదీప్‌, గిల్‌ మధ్య మంచి బాండింగ్‌ ఉంది. పైగా ఇద్దరు పంజాబ్‌కి చెందిన వారే. కాగా, ఈ మ్యాచ్‌లో గిల్‌ మెడనొప్పితో ఆడలేదనే విషయం తెలిసిందే.

ఇక రవి బిష్ణోయ్‌-అర్షదీప్‌ సింగ్‌ మధ్య ఫన్నీ చిట్‌ చాట్‌ జరిగింది. ఎందుకంటే ఎప్పుడూ అంత హరిబరిగా ఉంటావ్‌.. ఏదైన ఫాస్ట్‌ ఫాస్ట్‌గా చేస్తుంటావ్‌ అంటూ అర్షదీప్‌.. బిస్ణోయ్‌ని అడిగాడు. ఏమో తెలియదు.. నాకు అదే అలవాటు. ఆ అలవాటుతోనే నేను నా రన్నప్‌ను కూడా త్వరగా పూర్తి చేస్తుంటాను అంటూ సరదాగా వెల్లడించాడు. తినేటప్పుడు కూడా వేగంగా తింటావ్‌, వెంటనే రూమ్‌కి వెళ్లిపోతావ్‌.. ఎందుకంతా హడావిడి అంటూ అర్షదీప్‌ ఆటపట్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన రవి బిష్ణోయ్‌.. తొలి మ్యాచ్‌లో తన గాయమైనా.. కట్టుతోనే మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా కంటి కింది భాగంలో కట్టుతోనే మ్యాచ్‌ ఆడాడు. ఓటమిని ఒప్పుకోని తత్వమే తనను ఇలా ఆడేలా చేస్తుందని బిష్ణోయ్‌ వెల్లడించాడు. మరి అర్షదీప్‌-బిష్ణోయ్‌ చిట్‌ చాట్‌తో పాటు, గిల్‌-అర్షదీప్‌ బాండింగ్‌పై ఈ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments