iDreamPost

అవును కోహ్లీ స్వార్థపరుడే! టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌

  • Author Soma Sekhar Published - 03:52 PM, Mon - 6 November 23

విరాట్ కోహ్లీ స్వార్థపరుడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్.

విరాట్ కోహ్లీ స్వార్థపరుడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్.

  • Author Soma Sekhar Published - 03:52 PM, Mon - 6 November 23
అవును కోహ్లీ స్వార్థపరుడే! టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌

ప్రపంచ కప్ లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. తాజాగా టేబుల్ టాపర్ల మధ్య జరిగిన పోరులో కూడా భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించి.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేస్తూ.. అజేయ శతకం సాధించాడు విరాట్. అయితే కోహ్లీ శతకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో అతడు స్వార్థపూరిత ఇన్నింగ్స్ ఆడాడని కొందరు విమర్శిస్తున్నారు. ఇక ఈ విమర్శలపై అదిరిపోయే కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్. అవును నిజంగానే కోహ్లీ స్వార్థపరుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి వెంకటేష్ ప్రసాద్ ఈ కామెంట్స్ ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 326 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత జట్టు ఇంత స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది విరాట్ కోహ్లీ. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, జడేజాలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు కింగ్ కోహ్లీ. ఈ క్రమంలో 120 బంతుల్లో వన్డేల్లో తన 49వ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. కాగా.. విరాట్ సెంచరీ కోసం ఇన్ని బంతులు ఆడటం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్ లో విరాట్ ది పూర్తి సెల్పిష్ బ్యాటింగ్ అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలా విరాట్ ను విమర్శిస్తున్న వారికి ఆ రేంజ్ లోనే సమాధానం ఇచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్.

“కోహ్లీ గురించి కొన్ని ఫన్నీ కామెంట్స్ వింటున్నా.. అతడికి వ్యక్తిగత రికార్డులు అంటే పిచ్చి అని.. అందుకే ఇలాంటి సెల్ఫిష్ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడని చాలా మంది అంటున్నారు. అవును నిజమే.. కోహ్లీ నిజంగానే స్వార్థపరుడు. ఎంతలా అంటే.. వంద కోట్ల భారతీయుల కలలను వెంటాడేంత సెల్ఫిష్. ఎంతో సాధించినా.. ఇంకా సాధించాలనే స్వార్థపరుడు. కొత్త రికార్డులు బెంచ్ మార్క్ గా పెడుతూ, జట్టు విజయాల కోసం పోరాడేంత సెల్ఫిష్” అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు వెంకటేష్ ప్రసాద్. సచిన్ ను విమర్శిస్తున్న వారందరికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. మరి కోహ్లీపై వస్తున్న విమర్శలకు వెంకటేష్ ప్రసాద్ ఇచ్చిన సమాధానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి