iDreamPost

విరాట్ కోహ్లీకి ‘వామిక’ ఫాదర్స్ డే గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా? పోస్ట్ వైరల్..

ఫాదర్స్ డే నాడు విరాట్ కోహ్లీకి కూతురు వామిక, కొడుకు అకాయ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది అనుష్క శర్మ. ఆ వివరాల్లోకి వెళితే..

ఫాదర్స్ డే నాడు విరాట్ కోహ్లీకి కూతురు వామిక, కొడుకు అకాయ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది అనుష్క శర్మ. ఆ వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీకి ‘వామిక’ ఫాదర్స్ డే గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా? పోస్ట్ వైరల్..

సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు జూన్ 16(ఆదివారం) ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రిపై ఉన్న ప్రేమను ఏ విధంగా వ్యక్త పరిచారో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కామన్ పీపుల్, సెలబ్రిటీలు. ఇక ఈ స్పెషల్ డే నాడు విరాట్ కోహ్లీకి కూతురు వామిక, కొడుకు అకాయ్ ఏ బహుమతి ఇచ్చారు అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మరి ఇంతకీ కోహ్లీకి కూతురు, కొడుకు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటూ.. ప్రతి ఒక్కరు తమ తండ్రికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీలు అయితే కాస్తంత రిచ్ గానే ఈ బహుమతులు ఇస్తారు. ఈ స్పెషల్ రోజున టీమిండియ రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీకి కూతురు వామిక, కొడుకు అకాయ్ లు పెద్ద గిఫ్టే ఇచ్చారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అనుష్క శర్మ. అనుష్క ఒక అందమైన పెయింటింగ్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో తమ కూతురు వామిక, కొడుకు అకాయ్ ల పాద ముద్రలు కనిపిస్తున్నాయి.

పసుపు రంగులో ఉన్న ఈ పెయింటింగ్ ను పోస్ట్ చేస్తూ.. హ్యాపీ ఫాదర్స్ డే అని క్యాప్షన్ ఇచ్చింది అనుష్క శర్మ. “ఒక వ్యక్తి ఇన్ని విషయాల్లో.. ఇంత మంచిగా ఎలా ఉండగలడు? మేము నిన్ను ప్రేమిస్తున్నాం విరాట్ కోహ్లీ” అని రాసుకొచ్చింది అనుష్క. ఇక ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ కావడంతో.. అభిమానులు స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీకి తమ పిల్లల తరఫున అనుష్క శర్మ పెద్ద గిఫ్టే ఇచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితమే అనుష్క శర్మ రెండవసారి తల్లిగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. లండన్ లో ఆమె అకాయ్ కు జన్మనిచ్చింది. మరి విరాట్ కోహ్లీకి ఫాదర్స్ డే రోజు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి